ఆదివారం నుండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్రికెట్ ఆటల పోటీలు.
By
Rathnakar Darshanala
ఆదివారం నుండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్రికెట్ ఆటల పోటీలు.
నేటి వార్త జనవరి 25 తాండూర్ :
కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్లమెంట్,ను యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం 26న నిర్వహిస్తున్నట్లు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పట్టెం విష్ణుకళ్యాణ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాండూర్ మండలంలోని మాదారం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మైదానంలో నిర్వహించడం జరుగుతుంది.
ఇందులో 30టీంలు పాల్గొంటాయి మొదటి బహుమతి రూ.20,000 రెండవ బహుమతి రూ.10,000 ఉంటుందని తెలిపారు,
ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి క్రీడాకారులు,అధికారులు, నాయకులు, యువకులు,పాల్గొనాలని కోరారు..
Comments