తెలంగాణ రాష్ట్రం నుండి కుంభమేళాకు వెళ్లేవారికి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయండి-

Rathnakar Darshanala
తెలంగాణ రాష్ట్రం నుండి కుంభమేళాకు వెళ్లేవారికి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయండి-
నేటి వార్త జనవరి 29 రామ్ మందిర్ ఏరియా కాశెట్టి శివ.

ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో పన్నెండేళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా చివరిసారి 2013లో జరిగింది. 

అప్పట్లో 20 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసినట్టు అంచనా. 

కానీ, ఈసారి అంతకు మించి వస్తారని భావిస్తున్నారు. భారత్‌లోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా 123 దేశాల నుంచి ఈసారి 40 కోట్ల మంది వస్తారనే అంచనాతో యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 

ఈ క్రమంలో పలు ప్రాంతాల నుంచి రైల్వే సైతం ప్రత్యేక రైళ్లు నడుపుతోందని కావున తెలంగాణ రాష్ట్రం రామగుండం మీదుగా  కూడ మరిన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ద్వార రామగుండం రైల్వే స్టేషన్ మాస్టర్ కి రేణికుంట్ల నరేంద్ర, 

అసిఫ్ పాషా కల్సి వినతి పత్రం బుధవారం రోజున ఇవ్వడం జరిగిందన్నారు.అనంతరం ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు *మద్దెల దినేష్* తెలంగాణ రాష్ట్రం నుండి మరిన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని

 ట్విట్టర్ (X) ద్వార కేంద్ర రైల్వే మంత్రి మరియు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు, ప్రధానమంత్రి కార్యాలయం తో, రైల్వే ఫిర్యాదుల విభాగంతో పాటు సంబంధించిన ప్రధాన అధికారులకు తెలియజేయడం జరిగిందన్నారు.

అనంతరం *మద్దెల దినేష్, రేణికుంట్ల నరేంద్ర* లు మాట్లాడుతూ ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 14 నుంచి ఫిబ్రవరి 28 వరకు 45 రోజుల పాటు జరగనున్న మహా కుంభమేళాకు యూపీ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిందని, 

ఈ కుంభమేళాలో 45 కోట్ల మందికిపైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోందని, 

కావున తాజాగా, తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించినప్పటికి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు వెళ్లేవారి కోసం అదనంగా మరి కొన్ని ప్రత్యేక రైలు సర్వీసులను నడపించాలని

 దక్షిణ మధ్య రైల్వే అధికార్లతో పాటు కేంద్ర రైల్వే మంత్రి ని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నిర్వహకులు   తెలిపారు. 

దానికి సానుకూలంగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించి ప్రేత్యేక రైళ్ల షెడ్యూల్ ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగిందన్నారు.
Comments