పాఠశాలను ఆకస్మికంగా* తనిఖీ చేసిన డీఈఓ. రామారావు.
By
Rathnakar Darshanala
పాఠశాలను ఆకస్మికంగా* తనిఖీ చేసిన డీఈఓ. రామారావు.
నేటి వార్త,జనవరి 28 లక్ష్మణచాంద :
లక్ష్మణ్ చందా మండలంలోని జెడ్పిహెచ్ఎస్ వడ్యాల్ పాఠశాలను నిర్మల్ జిల్లా డీఈవో రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఉదయం 9 గంటలకే పాఠశాలకు చేరుకొని ప్రార్థనకు హాజరయ్యారు. ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఉదయం సాయంత్రం వేళల్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు.
నిర్మల్ జిల్లాను ఆపార్ లో మొదటి స్థానంలో ఉంచేలా చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ అశోక్ వర్మ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు
Comments