ఎంపీడీవో ఎదుట మొరపెట్టుకున్న ఫీల్డ్ అసిస్టెంట్లు.
By
Rathnakar Darshanala
ఎంపీడీవో ఎదుట మొరపెట్టుకున్న ఫీల్డ్ అసిస్టెంట్లు.
నేటివార్త జనవరి 29 జగిత్యాల నియోజకవర్గం ప్రతినిధి:
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లబ్ధిదారులను 2023-24 ఆర్థిక సంవత్సరంలో 20 రోజులు పని చేసి,భూమిలేని నిరుపేద కుటుంబాలకు చెందిన వారిని ఆన్లైన్ ద్వారా ఎంపిక చేసినట్లు ఎంపీడీవో బింగి చిరంజీవి తెలిపారు.
బుధవారం రాయికల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఎంపీడీవో ను కలిసి గ్రామాలలో,
తమను ఉపాధి కూలీలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో మమ్ములను ఎంపిక చేయలేదని ఎక్కడ కనబడితే అక్కడ దూషిస్తున్నారని వినతి పత్రం అందజేశారు.
మీకు ఇష్టమైన వారి పేర్లను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఎంపిక చేశారని,మేము కూడా ఉపాధి హామీ కూలీకి వచ్చామని,
ఎందుకు మా పేర్లను ఎంపిక చేయలేదని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ...
2023-24 ఆర్థిక సంవత్సరంలో 20 రోజులు పని చేసి భూమిలేని నిరుపేద కుటుంబాలకు చెందిన వారి పేర్లను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో ఆన్లైన్ ద్వారా ఎంపిక చేసామని,ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్లను దూషించిన, ఇబ్బందులకు గురి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు గ్రామపంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు మండల అధ్యక్షులు భూక్యా తిరుపతి,మహమ్మద్ నషీర్, కనికరపు లక్ష్మణ్,మహేష్, మల్లేశం,శ్రీనివాస్,నర్సయ్య, తిరుపతి,రవి తదితరులు పాల్గొన్నారు.
Comments