మురిసిన మువ్వన్నెల జెండా వందనం.
By
Rathnakar Darshanala
మురిసిన మువ్వన్నెల* *జెండా వందనం.
నేటి వార్త, జనవరి 26 లక్ష్మణచాంద :
లక్ష్మణ చందా మండలంలోని ప్రతి గ్రామంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ జానకి, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రాథోడ్ రాధా,పోలీస్ స్టేషన్లో ఎస్సై సుమలత,
వ్యవసాయ కార్యాలయంలో వసంత్ రావు,ఎంఈఓ కార్యాలయంలో అశోక్ వర్మ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ప్రత్యూష, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో కార్యదర్శిలు,
జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రాజు నాయక్, కస్తూరిబా గాంధీ పాఠశాలలో ఎస్ఓ నవిత అంగన్వాడి పాఠశాలల్లో ఆయా అంగన్వాడి టీచర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
కస్తూరిబా పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులు,అధికారులు, రైతులు,విద్యార్థులు పాల్గొన్నారు.
Comments