ఉత్తమ ఉద్యోగిగా ఎలక్ట్రికల్ ఏడిఈ వెంకటేశ్వర్లుకు పురస్కారం.
By
Rathnakar Darshanala
ఉత్తమ ఉద్యోగిగా ఎలక్ట్రికల్ ఏడిఈ వెంకటేశ్వర్లుకు పురస్కారం.
(జేమ్స్ రెడ్డి నేటి వార్త ప్రతినిధి)
విద్యుత్ వినియోగదారుల సమస్యలు సత్వరమే పరిష్కరించడంలో, వారికి నాణ్యమైన విద్యుత్తును నిరాటంకంగా సరఫరా చేయడంలో ప్రతిభ
కనబరిచినందుకుగాను గోదావరిఖని ఎన్పీడీసీఎల్ ఎలక్ట్రికల్ ఏడీఈ కే.వెంకటేశ్వర్లు 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ ఉద్యోగిగా ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందుకున్నారు.
వరంగల్ జిల్లా కేంద్రంలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయం విద్యుత్ భవన్ లో టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి, వెంకటేశ్వర్లుకు పురస్కారం అందజేసి, అభినందించారు.
ఇదే స్పూర్తితో మరింత బాధ్యతతో వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని సూచించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు పాల్గొన్నారు. కాగా వెంకటేశ్వర్లు ఉత్తమ ఉద్యోగిగా పురస్కారం అందుకోవడం పట్ల ఎన్పీడీసీఎల్ అధికారులు,
ఉద్యోగులు, సిబ్బందితోపాటు ఆయన శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
Comments