రోడ్లమీద వాహనాలు పార్కింగ్ చేయాకుడదు...ఎస్ఐ.
By
Rathnakar Darshanala
రోడ్లమీద వాహనాలు పార్కింగ్ చేయాకుడదు...ఎస్ఐ.
నేటివార్త,జనవరి 27, తాండూర్:
హోటల్,షాపుల ముందు, రోడ్లమీద వాహనాలు పార్కింగ్ చేయకుండా షాపుల యజమానులు చూసుకోవాలని ఎస్ఐ కిరణ్ కుమార్ అన్నారు.
సోమవారం తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐబీ చౌరస్తాలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలపై ఆటో డ్రైవర్లకు, దుకాణాల యజమానులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.కిరాణ దుకాణాల ముందు,హోటల ముందు ఇతర షాపుల ముందు.
వాహనాలు నిలుపాకుండా షాపు యాజమానులు చూడాలని అన్నారు.కొనుగోలుదారుడుషాపు లో వస్తువులు కోనుగోలు చేసిన తర్వాత అతను తేచ్చుకున్న వాహనాన్ని తీపించాలని రాకపోకలు సాగించే,
వాహనాలకు,ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని తెలిపారు.ఎక్కువ చేపూ వాహనాలను రోడ్డుపైన నిలిపితే జరిమాన వేస్తామని సూచించారు.
ట్రాఫిక్ రూల్స్ పాటించాలని బైక్‌పై వెళ్లినప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని,కారులో ప్రయాణించేటప్పుడు సీటు బెల్ట్ ధరించాలన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ రూట్‌లో ప్రయాణించరాదన్నారు.రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ ప్రజల్లో కూడా అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది,ఆటో డ్రైవర్లు, దుకాణం యాజమానులు, ప్రజలు పాల్గొన్నారు.
Comments