ఆర్ పిఎఫ్ జిల్లా అధ్యక్షునిగా కుమార స్వామి.
By
Rathnakar Darshanala
ఆర్ పిఎఫ్ జిల్లా అధ్యక్షునిగా కుమార స్వామి.
నేటి వార్త జనవరి 21 పెద్దపల్లి ప్రతినిధి అడిచెర్ల రమేష్.
రాయల్ పీపుల్స్ ఫ్రంట్ జిల్లా అధ్యక్షునిగా తెలంగాణ రాష్ట్ర జేఏసీ సభ్యునిగా రేండ్ల కుమార స్వామి పటేల్ ను నియామించినట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తిరుమలశెట్టి రెడ్డి శేఖర్ తెలిపారు.
ఈమేరకు నియామక పత్రం అందజేశారు. రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన చెందిన రేండ్ల కుమారస్వామి పటేల్ ను దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్,
తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోని బలిజ, కాపు, తెలగ, ఒంటరి రైతుల సమస్యల పరిష్కారానికి,
వారి వ్యాపార అభివృద్ధికి, యువత ఉపాధి అవకాశాలకు, వారి ఐక్యతకు పనిచేస్తున్న ఆర్ పి ఎఫ్ తెలంగాణలోని మున్నూరు కాపుల అభివృద్ధికి కృషి చేయాలని ఆయనకు సూచించారు.
తన నియామకానికి సహకరించిన రాయల్ పీపుల్స్ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు తిరుమలశెట్టి రెడ్డి శేఖర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కుమార స్వామి మాట్లాడుతూ తెలంగాణలోని మున్నూరు కాపులను రాజకీయంగా చైతన్యపరచడానికి
ఈ సంస్థ పనిచేస్తుందని, సమాజంలోని పలువురి సహకారంతో రాజకీయ సేవలో ఉన్నవారిని ప్రోత్సహిస్తున్న ఈ సంస్థ ద్వారా సంస్థ నియమ నిబంధనలకు లోబడి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు.
Comments