పథనం అయినా మిర్చి ధర. రైతుకు కన్నీటిని మిగిల్చిన మిర్చి పంట.

Rathnakar Darshanala
పథనం అయినా మిర్చి ధర. రైతుకు కన్నీటిని మిగిల్చిన మిర్చి పంట.
 గుంటూరు మిర్చి యార్డులో రైతుల కష్టాలు

 మిర్చి యార్డులో ధర కింటా రూ 10 వేలు కూడా పలకడం లేదు

 నేటి వార్త జనవరి 21 స్టేట్ బ్యూరో 
గుంటూరు...ఆసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ యార్డులో "మిర్చి ధర"  పతనమైంది మిర్చి రేట్లు తగ్గుదల తో రైతన్న దిగాలు.. చెందారు.

ప్రకృతి సహకరించినా పండించిన పంటకు ధరలేక రైతన్న బెంబేలెత్తు తున్నారు *రైతన్నకు కాలం కలసివచ్చినప్పుడు కూడా పండిన పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు కుదేలవుతున్నారు.

ప్రధానంగా గత సంవత్సరం.కన్నా పంటదిగుబడి నేడు ఎక్కువగా రావడంఒకవంతైతే... ఎగుమతి లేకపోవడం మరొక వంతైంది* 

ఎగుమతి వ్యాపారం నిలిచిపోవడం మనేదే ఎక్కువగామిర్చి రేటు పెరగక  పోవడం అనేది ప్రధాన సమస్యగా మారింది..

.మరీ ముఖ్యంగా గతంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో గుంటూరు , కృష్ణా, ప్రకాశంజిల్లాలలో మిర్చి పంట సాగు ఎక్కువగా ఉండేది...కానీ ఈసారి సాగు విస్తీర్ణం తగ్గింది.

 గతంలో కిలో 200 నుంచి రూ 300 పలికిన ఎండుమిర్చి ధర నేడు నేడు కిలో 100 కూడా పలకడం లేదు దీనికి తోడు 

 తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో మార్కెట్ యార్డ్ స్థాపన చేసి ముఖ్యమైన పంటగా మిర్చికి ప్రాధాన్యత నివ్వడం కూడా కారణ మయింది,

ఒక ఎకరా మిర్చి సాగు చేయాలంటే సుమారు రూ రెండు నుంచి . రూ మూడు లక్షలు ఖర్చు అవుతుంది అని రైతులు చెబుతున్నారు .

పంటను పండించే రైతుకు కూలీల రేట్లు విపరీతంగా పెరగడం, పంటను పండించడానికి కావాల్సిన ఎరువులు రేట్లు ఆకాశంలో ఉండటంతో పంటను పండించడానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది...

పండిన పంటను మార్కెట్ యార్డులో అమ్ముకోవడానికి వస్తే ఇక్కడా కూడా కాటా రేట్లు, ముఠా కూలి రేట్లువిపరీతంగాపెరిగిపోయాయి.

..మరోపక్క వాహనాలలో మార్కెట్ యార్డుకు తీసుకురావడానికి వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది...

ఇక ఇలా చూసుకుంటూ పోతే ప్రక్క రాష్ట్రాలలోతమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్,ఉత్తర ప్రదేశ్ సైతం మిర్చి పంటను పండించడానికి తహతహలాడుతున్నారు...

ఇలాంటి సమయంలో పండిన పంటనసరైన కాలంలో అమ్ముకోకపోతే రైతు తీవ్రంగా నష్టపోవడం ఖాయం.మరోపక్క పండిన పంటను శీతల గిడ్డంగులలో దాచుకోవడానికి పోతే అక్కడా కూడా అద్దెల పేరుతో మోతమోగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...

శీతల గిడ్డంగుల పేరుతో రైతన్నల ఫేక్ ఆధార్, పాస్ పుస్తకాలు, పెట్టి నకిలీ రుణాల పేరుతో టోకరా వేయడం పరిపాటిగా మారిందని పలువురు రైతులు చెబుతున్నారు,

 ఇప్పట్టికైనా   ప్రభుత్వ హయాంలో దగా పడ్డ రైతన్నకు పాలక ప్రభుత్వం అయిన న్యాయం చేయాలని పలువురు రైతన్నలు.. కోరుచున్నారు.
Comments