గద్దర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి..

Rathnakar Darshanala
గద్దర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి..
- కొండు బాణేష్ రైతు సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శి.

నేటివార్త, జనవరి 29, బెల్లంపల్లి:

గద్దర్ ను విమర్శించడం తెలంగాణ ఉద్యమాన్ని కించపరచడమే అని
గద్దర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి, 

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రజాయుద్ధనౌక గద్దర్ ను అవమానించేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని, 

ఆ వ్యాఖ్యలను బండి సంజయ్ వెనక్కి తీసుకొని బేసరతుగా క్షమాపణ చెప్పాలని, తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలకంగా ప్రజలను చైతన్య పరుస్తూ పోరాడిన యుద్ధనౌక గద్దర్ పై అర్థర హితంగా బండి సంజయ్ మాట్లాడటం సిగ్గుచేటు అని,

 బిజెపి నేతలను హత్య చేయించిన గద్దర్ కు అవార్డు ఇవ్వాలా అంటూ నిరాధార ఆరోపణలు చేస్తూ మీడియా సాక్షిగా మాట్లాడిన సంజయ్ కేంద్ర మంత్రిగా ఉంటూ అప్రాజస్వామికంగా వ్యవహరిస్తున్నారన్నారని,

 బిజెపి చరిత్ర దేశ ప్రజలకు స్పష్టంగా తెలుసని, గాంధీని చంపిన గాడ్సేది బిజెపి, ఆర్ఎస్ఎస్ కాద అని, వాస్తవానికి బిజెపిది హత్య రాజకీయాల చరిత్ర అని, దేశంలో హిందుత్వం పేరుతో అణగారిన వర్గాల ప్రజలను గుజరాత్,

 ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో మారణహోమం చేసిన బిజెపి ఈ దేశానికి ప్రమాదమని, దేశ స్వాతంత్ర్యం లో బిజెపి పాత్రే లేదని దేశంలో జరిగిన పోరాటంలో బీజేపీ పాత్ర లేకున్నా చరిత్రను వక్రీకరించడంలో బిజెపి నీచ రాజకీయాలు చేస్తూ దేశంలో మత అజెండాను అవలంబిస్తున్నారని,

 బిజెపి మూల్యం చెల్లించుకోక తప్పదని, మీ అవార్డులకు అందని ఉద్యమ శిఖరం గద్దర్ ఆయన ఊపిరి విశ్వమంతా పాకిపోయింది విశ్వాన్నేలా భష్మం చేస్తారు ఆయన ఆలోచన జనసంద్రం నిండా నిండిపోయింది, 

సముద్రాన్నెలా బందీ చేస్తారు, ఆయన సృజించిన ఊహ మస్తీ స్కంలో దావానంలా ఉరితాడు వేస్తారు, ఆయన ఆట ఆయన పాట ఆయన స్ఫూర్తి అమరం, అఖిలం,

గద్దర్ కేవలం ప్రజాకవి మాత్రమే కాదు తెలంగాణ ప్రజల స్వరాన్ని ప్రపంచానికి వినిపించిన గొంతు, అలాంటి ప్రజాయుద్ధనౌక గద్దర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అనాగరికంగా ఉన్నాయి,

 బిజెపి పేరు చెప్పుకుంటూ ప్రతి వ్యవస్థను రాజకీయం చేయడం ఈ విధానం అయితే ప్రజలు కచ్చితంగా తగిన గుణపాఠం చెబుతారు. 

పద్మ పురస్కారాలు భారతీయ సమాజంలో విభిన్న రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి గుర్తింపు మాత్రమే కాదు అవి దేశ గౌరవానికి ప్రతీక 

అలాంటి పురస్కారాల మీద మీ విమర్శలు కించపరిచే ప్రయత్నం తప్ప వేరే ఉద్దేశం కనిపించడం లేదు. గద్దర్ పాటలు తెలంగాణ ప్రజలలో స్ఫూర్తిని నింపాయి, 

అలాంటి వ్యక్తిని అవమానించడం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టే చర్యగానే ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ విప్లవ కవిని మాత్రం మీరు జీర్ణించుకోలేరా తెలంగాణ కవులను మీరెందుకు చిన్న చూపు చూస్తున్నారు, 

బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కేవలం గద్దర్ మీద మాత్రమే కాదు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి పై కూడా దాడి, బండి సంజయ్ తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకు బేసరతుగా క్షమాపణ చెప్పాలి

 అని కొండు బాణేశ్ రైతు సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇందారపు రాజేష్ రైతు సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు, కొండ సాయికుమార్, కంబాల చందు, ఠాగూర్ శ్యాంసింగ్, రామయ్య, సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.
Comments