Ap :గమ్మునుండవయ్యా గుమ్మనూరు..!
By
Rathnakar Darshanala
గమ్మునుండవయ్యా గుమ్మనూరు..!
ఎమ్మెల్యేకు టీడీపీ అధష్ఠానం క్లాస్.
నేటి వార్త జనవరి 30 స్టేట్ బ్యూరో :
పాత్రికేయులపై బెదిరిస్తూ కామెంట్స్ చేసిన గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది.
పద్దతి మార్చుకోవాలంటూ హెచ్చరించింది బుధవారం ఉదయం పాత్రికేయులతో సమావేశంలో గుమ్మనూరు జయరాం తనకు, తన తమ్ముడికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే బాగోదని హెచ్చరించారు.
ఏదైనా ఉంటేతనతోఇప్పుడేమాట్లాడాలంటూ పాత్రికేయు లను బెదరించారు.
తర్వాత ఇష్టం వచ్చినట్టు రాస్తే మాత్రం ఊరుకునేది లేదని అన్నారు. తప్పుడు వార్తలు రాసే పాత్రికేయులను రైలు పట్టాలపై పడుకోబెడతాననే పేరు ఉందని అదే చేస్తానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం చేసిన ఈ కామెంట్స్ ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అధికారం ఉందన్న అహంతో ఇలాంటి వార్నింగ్ ఇచ్చారని అంతా విమర్శలు చేశారు.
ఏకంగా మీడియాపై ఇలాంటి కామెంట్స్ చేయడంతో టీడీపీ అధినాయకత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.నేరుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గుమ్మనూరు జయరాంకు ఫోన్ చేసి తలంటారు.
ఇలా మీడియాను, వార్తలు రాసే జర్నలిస్టులను బెదిరించే సంస్కృతి టీడీపీలో లేదని గుర్తు చేశారు. పద్ధతి మార్చుకోవాలని సూచించారు.
దీనిపై చంద్రబాబు చాలా కోపంతో ఉన్నారని ఇలాంటివి రిపీట్ చేయొద్దని కూడాహెచ్చరించినట్లు సమాచారం
Comments