స్నేహితురాలి కుటుంబానికి రూ.50వేల ఆర్థిక సాయం.

Rathnakar Darshanala
స్నేహితురాలి కుటుంబానికి రూ.50వేల ఆర్థిక సాయం.
నేటివార్త జనవరి 24, తాండూర్:

మండలంలోని మాదారం సింగరేణి ఉన్నత పాఠశాలలో 2001-02 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు తన స్నేహితురాలి కుటుంబానికి అండగా నిలిచారు.

మాదారం టౌన్ షిప్ కు చెందిన రజిత అనే స్నేహితురాలు ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందింది.

రజిత కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న పూర్వ విద్యార్థులు రూ.50 వేల రూపాయలు సమీకరించి తన కూతురు సాయి చందన, పేరుతో తాండూర్ 

ఎస్,బి,ఐ, బ్యాంక్ లో డిపాజిట్ చేసి బాండ్ ను పూర్వ విద్యార్ధులు, బ్యాంకు మేనేజర్ సంతోష్ కుమార్ కలిసి శుక్రవారం అందజేశారు.

విరాళం అందజేసిన పూర్వ విద్యార్థులకు ఆ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments