Hyd :ఉత్సాహ భరితంగా వాలీబాల్ పోటీలు.
By
Rathnakar Darshanala
ఉత్సాహ భరితంగా వాలీబాల్ పోటీలు.
>మేడిపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో జర్నలిస్టులకు ఆటల పోటిలు.
నేటి వార్త: మేడిపల్లి:గణతంత్ర దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని మేడిపల్లి మండల ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో శుక్రవారం నాడు జర్నలిస్టులకు ఆటల పోటీలు నిర్వహించారు.
ఈ పోటీలను సీనియర్ జర్నలిస్టు ప్రెస్ క్లబ్ సలహాదారు వీఎస్ఎన్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వీఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలతో పాటు,ఇతర అంశాలపై వార్తా సేకరణలో బిజీగా ఉండే జర్నలిస్టులకు ఆటలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని ఇలాంటి ఆటల పోటీలు అప్పుడప్పుడు నిర్వహించడం మంచి పరిణామమన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష,కార్యదర్శులు రెండు టీములుగా విభజించుకొని అధ్యక్ష టీం కెప్టెన్ కలుకూరి ఎల్లయ్య, వి సుందర్, దయాకర్ రెడ్డి అంజన్ కుమార్,
మధు, భగీరథ, కార్యదర్శి టీం చిర్ర శ్రీధర్ రెడ్డి, రాము యాదవ్, నరసయ్య గౌడ్, మత్స్యగిరి, నరేందర్ యాదవ్, చిన్నం గణేష్ లతో జరిగిన వాలీబాల్ పోటీలలో అధ్యక్షుల టీం గెలుపొంది మొదటి స్థానంలో నిలిచింది.
ఈ కార్యక్రమంలో పాషా క్రికెటర్ అకాడమీ చైర్మన్ పాషా, ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments