Telangana :నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే..!!

Rathnakar Darshanala
నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే..!!

నేటి వార్త మల్యాల ప్రతి నిధి :

దొనకొండ రమేష్ :

 రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే(కులగణన) చేపట్టనుంది. ప్రతి ఇంటికి వెళ్లి దాదాపు 75 ప్రశ్నలతో ప్రభుత్వ సిబ్బంది సర్వే చేయనున్నారు.

కుటుంబ యజమాని, సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు, వారు చేసే పని, తీసుకున్న రుణాలు, ఆస్తులు వంటి వివరాలను నమోదు చేస్తారని సమాచారం. 

ఈ నెలాఖరులోగా సర్వే పూర్తి
 చేయాలని సర్కార్ భావిస్తోంది. సర్వే పూర్తయిన ఇంటికి స్టిక్కర్ వేసేలా ఏర్పాట్లు చేసింది. దీనికోసం అధికారులు సమయత్వం అయినారు.
Comments