ఫుట్ బాల్ టోర్నమెంట్ విజేత గా శ్రీరాంపూర్ జట్టు.

Rathnakar Darshanala
ఫుట్ బాల్ టోర్నమెంట్ విజేత గా శ్రీరాంపూర్ జట్టు.
మందమర్రి టౌన్.

  మందమర్రి  :ఏరియా సింగరేణి  హై స్కూల్ గ్రౌండ్ లో రెండు రోజుల నుండి జరుగుతున్న   కంపెనీ లెవెల్ ఫుట్ బాల్ టోర్నమెంట్ బుధవారం రోజున ముగింపు దశకు చేరుకుంది . 

ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏరియా పర్సనల్ మేనేజర్. ఎస్. శ్యామసుందర్  పాల్గొన్నారు అతను మాట్లాడుతూ ముందుగా క్రీడల్లో  పాల్గొన్న క్రీడాకారుల అందరికీ అభినందనలు తెలిపారు . 

క్రీడల్లో
గెలుపు ఓటములు సహజమని 
క్రీడాకారులు  ఇలాంటి కంపెనీ లెవల్లో  మీ ఆటను ప్రదర్శించి మీ ఏరియా కు  విజయం సాధించాలని అన్నారు.

అనంతరం ఈ కంపెనీ లెవెల్ ఫుట్ బాల్ టోర్న మెంట్ లో  విన్నర్స్ గా  నిలిచిన శ్రీరాంపూర్ ఏరియా క్రీడాకారులకు మొదటి బహుమతి రన్నర్ గా నిలిచిన జీడికే-1&2 క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.

విన్నర్స్ గా గెలిచిన శ్రీరాంపూర్ ఏరియా వారిని అభినందిస్తూ  కోల్ ఇండియా స్థాయిలో గెలుపొంది సింగరేణికి మంచి పేరును తీసుకురావాలని  వారికి  తెలియజేశారు.

అలాగే ఈ కంపెనీ స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ పోటీలను ఈ రెండు రోజులు చక్కటి ఏర్పాట్లను చేసినటువంటి మందమర్రి  ఏరియా గౌరవ కార్యదర్శి, కోఆర్డినేటర్, ఆర్గనైజర్స్ ను  మరియు స్పోర్ట్స్ సూపర్వైజర్ లను అభినందించారు.

ఈ కార్యక్రమంలోAITUC బ్రాంచ్ సెక్రటరీ అక్బర్ అలీ మరియు దాగం మల్లేష్, CMOAI అధ్యక్షులు రమేష్,
WPS &GA గౌరవ కార్యదర్శి  కార్తీక్, స్పోర్ట్స్ సూపర్వైజర్ కార్పొరేట్ పాస్నేట్ , స్పోర్ట్స్ సూపర్వైజర్లు జాన్ వెస్లీ,  

Ch.అశోక్, H.రమేష్, P. శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ S. శివ కృష్ణ , జనరల్ క్యాప్టన్ సాక శ్రీనివాస్ మరియు అన్ని ఏరియాల క్రీడాకారులు,  అధికారులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
Comments