Breaking News:అప్పుడే పుట్టిన శిశువులు తారుమారు.

Rathnakar Darshanala
Breaking News:అప్పుడే పుట్టిన శిశువులు తారుమారు.
 *జగిత్యాల మాత శిశు ఆసుపత్రిలో జరిగిన ఘటన*

నేటివార్త జగిత్యాల బ్యూరో నవంబర్ 04 :

 జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాత శిశు ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన నవజాత శిశువుల తారుమారు అయిన ఘటన వెలుగులోకి వచ్చింది. 

బీర్పూర్ మండలం మంగలే గ్రామానికి చెందిన ప్రసన్న డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరింది.సోమవారం ప్రసన్నతో పాటు మరో గర్భిణి కూడా డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరింది. 

ఇద్దరికి డెలివరీ చేసిన వైద్యులు శిశువులకు ఉన్న ట్యాగును గుర్తించకుండా ఒకరి బేబీని మరొకరికి అందించి తారుమారు చేశారు. కొద్దిసేపటి తర్వాత పొరపాటున గుర్తించిన సిబ్బంది ఎవరి పిల్లలను వారికి అప్పగించారు.  

ఈ ఘటనపై గర్భిణి బంధువులు ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.నిర్లక్ష్యం చేసిన ఆసుపత్రి సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాలని గర్భిణీ బంధువులు కోరారు.
Comments