రైతులకు ఇబ్బందులు కలుగకుండా కనీస మౌలిక వసతులు కల్పించాలి- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి.
By
Rathnakar Darshanala
- రైతులకు ఇబ్బందులు కలుగకుండా కనీస మౌలిక వసతులు కల్పించాలి- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి.
- -
నేటి వార్త మదనాపురం
వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా కనీస మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
సోమవారం మదనాపురం మార్కెట్ యార్డులో ఐ.కే.పి ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని కలక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారువరి ధాన్యం తమ శాతాన్ని, సన్న రకమా లేక దొడ్డు రకమా అనేది ఎలా తెలుసుకోవాలి అనే విషయాల పై కొనుగోలు కేంద్రాల సిబ్బందిని ప్రశ్నించారు.
డిజిటల్ క్యాలిపర్ యంత్రం ఉపయోగించే విధానాన్ని పరిశీలించారు.సన్న రకం వరి ధాన్యానికి మద్దతు ధర క్వింటాలుకు రూ .2300 తో పాటు అదనంగా 500/- బోనస్ ఇవ్వడం జరుగుతుందని అందువల్ల సన్న రకం, దొడ్డు రకం ధాన్యం కొనుగోలు కేంద్రాలు వేరు వేరుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సన్న రకానికి తేమ శాతం 14 ఉండాలని అదే దొడ్డు రకం అయితే 17 శాతం తేమ కలిగి ఉండాలని సూచించారు. దొడ్డు రకం వరి ధాన్యానికి మద్దతు ధర క్వింటాలుకు రూ. 2320 /- చెల్లించడం జరుగుతుంది.
అయితె ఈ దొడ్డు రకం వరి కొనుగోలు కేంద్రాలను వేరుగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది,ధాన్యం వర్ధానికి తడచిపోకుండ టాడ్పాలిన్ లు అందుబాటులోఉంచుకోవాలని,
రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు,కొనుగోలు చేసిన వరి ధాన్యం బస్తాల పై కొనుగోలు కేంద్రం రిజిస్టర్ నెంబరు, క్రమ సంఖ్య, సన్న రకం లేదా దొడ్డు రకం అనేది గన్ని బ్యాగుపై ముద్రించాలని సూచించారు.
రైతు తెచ్చిన ధాన్యం ఏ రకం అయినదో క్రాప్ బుకింగ్ సమయంలో నమోదు చేసిన వివరాలతో సరిచూసుకోవాలని సూచించారు.జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కాశీ విశ్వనాథ్, తాహసిల్దార్ అబ్రహం లింక,వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు కలక్టర్ వెంట ఉన్నారు.
Comments