రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎన్నికైన ప్రగతి విద్యార్థి.

Rathnakar Darshanala
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎన్నికైన ప్రగతి విద్యార్థి.

నేటి వార్త రాయికల్ నవంబర్ 4:

రాయికల్ పట్టణ కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి దానవేణి రిశ్వంత్, ఉమ్మడి జిల్లా స్థాయి అండర్-14 కబడ్డీ పోటీలు హుజురాబాద్ లో నిర్వహించగా అందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, 

 రాయికల్ మండలం నుండి రాష్ట్రస్థాయికి ఎన్నికైన ఏకైక విద్యార్థిగా నిలిచాడు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం దానవేణి రిశ్వంత్ ను,శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బాలె జయశ్రీ శేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లో కూడా రాణించాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల పిఈటి మహేష్ ని అభినందించారు.

 ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బాలె జయశ్రీ శేఖర్, అకాడమిక్ డైరెక్టర్ నిఖిల్ కుమార్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
Comments