కేంద్ర హోం శాఖ మంత్రికి మెమోరండం అందించిన బీజేపీ నేతలు.
By
Rathnakar Darshanala
కేంద్ర హోం శాఖ మంత్రికి మెమోరండం అందించిన బీజేపీ నేతలు.
పెద్దపల్లి బిజెపి మండల అధ్యక్షులు మేకల శ్రీనివాస్..
పెద్దపల్లి నవంబర్ 09: నేటి వార్త ప్రతినిధి అడిచర్ల రమేష్.
కరీంనగర్ రైల్వే లైన్ సికింద్రాబాద్ రైల్వే లైన్ల మధ్యలో నిర్మిస్తున్న బైపాస్ రైల్వే లైన్ పై అండర్ పాస్ నిర్మాణం ఏర్పాటు చేయాలని,
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ సహకారంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ. బండి సంజయ్ కుమార్ (ఎం.పీ.) పెద్దపల్లి మండల అధ్యక్షులు మేకల శ్రీనివాస్ అధ్యక్షతన కేంద్ర హోంశాఖ మంత్రికి శనివారం రోజున మెమోరండం ఇవ్వడం జరిగినది.
నాయకులు మాట్లాడుతూ పెద్దపల్లి నుండి కరీంనగర్ వెళ్తున్న రైల్వే లైను పెద్దపల్లి నుండి సికింద్రాబాద్ వెళ్లే రైల్వే లైన్ల మధ్యలో పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామం వద్ద నూతనంగా బైపాస్ రైల్వే లైన్ నిర్మించడం జరుగుతున్నది.
బైపాస్ రైల్వే లైన్ కారణంగా చీకురాయి గ్రామం పెద్దబొంకూర్ గ్రామాల రైతులకు చెందిన దాదాపు 500 పై చిలుకు ఎకరాల వ్యవసాయ భూములకు దారి మూసి వేయబడుతున్నది.
కావున ఆ బైపాస్ రైల్వే లైన్ పై అండర్ పాస్ నిర్మాణం ఏర్పాటు చేస్తే రైతులకు న్యాయం జరుగుతుందని అన్నారు.
నూతనంగా నిర్మిస్తున్న రైల్వే లైన్ పై అండర్ పాస్ నిర్మాణం ఏర్పాటు చేసేలా కృషి చేయగలరని కోరడం జరిగింది. అసెంబ్లీ కన్వీనర్ దాడి సంతోష్, ఓల్లే తిరుపతి ఉన్నారు.
Comments