అభివృద్ధి పేరుతో విధ్వంసం చేస్తే ఊరుకునేది లేదు.

Rathnakar Darshanala
అభివృద్ధి పేరుతో విధ్వంసం చేస్తే ఊరుకునేది  లేదు.
 న్యూ ఇండియా పార్టీ ఉపాధ్యక్షులు వేముల అశోక్ 


(జేమ్స్ రెడ్డి నేటి వార్త ప్రతినిధి)

అభివృద్ధి పేరుతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని న్యూ ఇండియా పార్టీ ఉపాధ్యక్షులు వేముల అశోక్ స్థానిక ప్రభుత్వాన్ని దుయ్యబడ్డారు.

గోదావరిఖని లక్ష్మీ నగర్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...అభివృద్ధి, షాపింగ్ మాల్స్ నిర్మాణాలు,రోడ్డు వైండింగ్, హైడ్రా, నాలాలపై అక్రమ నిర్మాణాల పేరుతో మొత్తం పట్టణా ప్రజలను చిరు వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

అసలు ఏ విధమైన ప్రాణాళిక,కౌన్సిల్ తీర్మానాలు బడ్జెట్ కేటాయింపులు లేకుండా ఒక్కొక్క వేదికలో ఒక్కొక్క విధమైన ప్రకటనలు చేస్తూ వారికి తోచిన విధంగా ఇటు నాయకులు అటు స్థానిక ప్రభుత్వ అధికారులు ఇష్టమొచ్చిన రీతిలో ఒక సారి రోడ్డు వైండింగ్ అని ఒకసారి అక్రమ నిర్మాణాలని మొత్తం పట్టణాన్ని కూల్చివేస్తున్నారని అన్నారు. 

ఇవాళ సామాన్యుడు ఈ ఊర్లో బ్రతికే ఛాన్సే లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు.ఏవో ఏవో కొత్త కొత్త పేర్లతో వచ్చి డేగల్లాగా రాబందుల్లాగా కూల్చివేసిస్తుంటే వారి బతుకులు చితిలమై అన్నమో రామచంద్రా అని ఇవాళ ఊరు కాలైపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో పక్కనున్న జిల్లాకి పొట్ట చేతిలో పట్టుకొని పారిపోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఎవరికి కూడా ముందస్తు సమాచారం 

ఇవ్వకుండా కూల్చిన ఆస్తులకు నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించకుండా ఉపాధి కల్పించకుండా రోడ్డుపాలు చేస్తున్నారన్నారు.గౌరవ తెలంగాణ హైకోర్టులో స్టేటస్కో లో ఉండగా ఆ భూమి మీద ఏ విధమైన హక్కులు పర్మిషన్లు లేకున్నా,

కోర్టు ఉత్తర్వులను పరిరక్షించవలసిన ఇటు పోలీసు శాఖ గాని అటు మున్సిపల్ శాఖ కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఇలాంటి విధానాలను ఇక్కడ స్థానిక ప్రభుత్వానికి ఈ నాయకులకే చెల్లిందన్నారు.

ఇలాంటి తీరును న్యూ ఇండియా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.న్యూ ఇండియా పార్టీ అభివృద్ధికి ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదని ఈ పట్టణానికి కావలసిన అభివృద్ధి గురించి సౌకర్యాల గురించి 20 ఏళ్ల ముందు చూపుతో పాటుపడిన ఏకైక పార్టీ న్యూ ఇండియా పార్టీ అని అన్నారు. 

ఈ పట్టణ వ్యాపారస్తులను ప్రజలను ముప్పు తిప్పలు పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రభుత్వ అధికారులు స్థానిక ఎమ్మెల్యే మీరు ఇప్పటి వరకు కూల్చిన ఎన్టిపీసీ గ్రీన్ బెల్ట్ బాధితులకైనా  కూల్చిన 150 ఇండ్ల బాధితులకు తక్షణమే 

ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు సహాయం చేసి వారు కోల్పోతున్న ఉపాధికి వారు కోల్పోతున్న ఆస్తులకి లెక్కలు కట్టి వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.నష్టపరిహారం ఇవ్వకుండా 

వారిని ఆదుకోకుండా మేము ఇలాగే చేస్తామని అనుకుంటే మీ ఆటలు సాగనీయమని  మీరు ప్రజా వ్యతిరేకతను చూడవలసి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. 

ఈ కార్యక్రమంలో డాక్టర్ జై రాజు సర్వర్ పటేల్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
Comments