డైట్ చార్జీలు పెంపుపై విధ్యార్థులు హర్షం.

Rathnakar Darshanala
డైట్ చార్జీలు పెంపుపై విధ్యార్థులు హర్షం.
పెద్దపల్లి నవంబర్ 02: నేటి వార్త ప్రతినిధి అడిచర్ల రమేష్.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గల మహాత్మ జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల బాలికల సంక్షేమ పాఠశాల, 

కళాశాల విద్యార్థినిలు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించవలసిన పౌష్టికాహార, కాస్మెటిక్ బిల్లులను పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 

ప్రభుత్వం రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలు,వసతి గృహాల విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందించాలని సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం డైట్ చార్జీలు నలభై శాతం పెంచడం పట్ల విద్యార్థినిలు, కళాశాల ప్రిన్సిపాల్ మణిదీప్తి, 

డిప్యూటీ వార్డెన్ సంధ్యా రాణి, ఉపాధ్యాయినులు సీ.ఎం. రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపలులు,  సిబ్బంది పాల్గొన్నారు.
Comments