పలు మండలాల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే..
By
Rathnakar Darshanala
పలు మండలాల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే..
పెద్దపల్లి నవంబర్ 02: నేటి వార్త ప్రతినిధి అడిచెర్ల రమేష్
సుల్తానాబాద్ మండలం నరసయ్యపల్లి, బొంతకుంటపల్లి,గర్రెపల్లి, భూపతిపూర్,ఐతరాజ్ పల్లి, దుబ్బపల్లి గ్రామాల్లో సింగిల్ విండో,ఐకెపి ల ద్వారా ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు సెంటర్లను శనివారం రోజున స్థానిక ప్రజాప్రతినిధులు,
నాయకులు, అధికారులతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలాంటి వడ్ల కటింగులు లేకుండా ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత నాది అన్నారు. ప్రతి గింజకు మద్దతు ధర చెల్లించి వడ్లను కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పారు.
సన్నవడ్లు వేసుకోమని చెప్పి రైతులను దివాలా తీయించింది బీ.ఆర్.ఎస్. అని ఆయన విమర్శించారు.
ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని వివరించారు.
అలాగే,సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 వందల చొప్పున బోనస్ చెల్లించడం జరుగుతుందన్నారు.
ఎన్ని క్వింటాళ్ల సన్నవడ్లు అమ్మితే రైతులకు పరిమితి లేకుండా క్వింటాల్ కు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వడం జరుగుతుందన్నారు.
నాణ్యమైన నిర్ణీత తేమతో కూడిన వడ్లను తీసుకువచ్చే బాధ్యత రైతులదని అన్నారు.
సెంటర్లలో వడ్లను కాంట వేసిన అనంతరం రైతులు రసీదులు తీసుకోవాలని అన్నారు.
సెంటర్ల ఇన్చార్జిలు ఇలాంటి తేడాలు లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. రైతులకు ఎక్కడ మోసం జరిగినా సహించేది లేదని స్పష్టం చేశారు.
గతంలోని బీ.ఆర్.ఎస్. ప్రభుత్వ పెద్దలు వడ్ల కటింగుల పేరిట రైతులను నిలువునా ముంచారని ఆరోపించారు.
తాను ఎమ్మెల్యేగాఎన్నికైన అనంతరం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు వల్ల వడ్ల కటింగ్ లకు స్థానం లేకుండా చేశామని చెప్పారు.
ప్రజల ఆశీర్వాదం తమకు ఉన్నంతకాలం ఇదే పద్ధతిని కొనసాగిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు సింగిల్ విండో చైర్మన్, డైరెక్టర్లు,మార్కెట్ డైరెక్టర్లు మండల అధ్యక్షులు చిలుక సతీష్,జానీ
ప్రజాప్రతినిధులు,మాజీ సర్పంచ్ లు,మాజీ ఎం.పీ.టీ.సీ లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..
Comments