బెల్లంపల్లి అటవి డివిజన్ లో దేవాపూర్ రేంజ్ ను కలపాలి.
By
Rathnakar Darshanala
బెల్లంపల్లి అటవి డివిజన్ లో దేవాపూర్ రేంజ్ ను కలపాలి.
- రెగ్యులర్ ఐ.ఎఫ్.ఎస్ అధికారిని నియమించాలి.
- కోనోకార్పస్ చెట్లను వెంటనే తొలగించాలి.
- ఎంసిపిఐ(యు)పార్టీ జిల్లా కమిటి డిమాండ్.
బెల్లంపల్లి, నవంబర్ 5, నేటివార్త :
బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో గల బెల్లంపల్లి అటవీ డివిజన్ ను ఆనుకొని ఉన్న దేవాపూర్ అటవీ రేంజ్ ను బెల్లంపల్లి డివిజన్ లో విలీనం చేయాలని,
కోనోకార్పస్ మొక్కలను వెంటనే తొలగించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అటవిశాఖ కన్జర్వేటర్ శాంతారం,
అటవిశాఖ జిల్లా కార్యాలయంలో సూపరింటెండెంట్ మల్లయ్య లకు ఎంసిపిఐ(యు)పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
అనంతరం వారు మాట్లాడుతూ బెల్లంపల్లి అటవీ డివిజన్ రాష్ట్రంలోనే అన్నింటికన్నా పెద్ద డివిజన్ గా పేరు ఉండేదని,ఈ డివిజన్ లో తిర్యాని, బెల్లంపల్లి, కుష్ణపల్లి,
రెబ్బెన, ఆసిఫాబాద్ రేంజ్ లు ఉండేవని,జిల్లాల విభజనలో భాగంగా బెల్లంపల్లి అటవీ డివిజన్ లో గల ఆసిఫాబాద్,
తిర్యాని, రెబ్బెన రేంజ్ లు ఆసిఫాబాద్ జిల్లా లోకి చేర్చారని, దీంతో బెల్లంపల్లి డివిజన్ లో నేడు బెల్లంపల్లి, కుష్ణపల్లి రేంజ్ లు మాత్రమే ఉన్నాయని,దీంతో ఈ డివిజన్ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని,
కొందరు అధికారులు కావాలని బెల్లంపల్లి అటవీ డివిజన్ ను ఎత్తివేసేందుకు కుట్రపూరితంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు మా పార్టీకి సమాచారం అందిందని,
ప్రస్తుతం బెల్లంపల్లి డివిజన్ ను అనుకొని ఉన్న దేవపూర్ అటవీ రేంజ్ ఇక్కడకు 35 కిలోమీటర్ల దూరాన గల
మంచిర్యాల అటవీ డివిజన్ లో ఉండడంతో వివిధ పనుల రీత్యా మంచిర్యాలకు అటవీ ఉద్యోగులు, సిబ్బంది వెళ్లాలంటే తీవ్ర ఆర్థిక వ్యయప్రయాసలతో పాటు సమయం కూడా వృధా అవుతుందని ఇప్పటికైనా
జిల్లా అధికార యంత్రాంగం వెంటనే స్పందించి బెల్లంపల్లి డివిజన్లో దేవపూర్ రేంజ్ ను విలీనం చేయాలని,అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా పల్లె,పట్టణాల పచ్చదనం,
సుందరీకరణ కోసం కోనో కార్పస్ మొక్కలను రోడ్లకు మధ్యలోని డివైడర్ లలో,పల్లె, ప్రకృతి వనాలలో, విద్యాలయాలలో
తదితర స్థలాల్లో ఈ మొక్కలను నాటారని,వృక్ష శాస్త్రజ్ఞుల సైతం వీటివల్ల ఆస్తమా,చర్మ వ్యాధులతో పాటు ఇతర జబ్బులు వస్తాయని,
భూగర్భ జలాలు కూడా అడుగంటుకు పోతాయని,ఇవి కొన్నిమీటర్ల లోతుకు వెళ్లడం వల్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజి,పైప్ లైన్,వైరింగ్ సిస్టం లు కూడా దెబ్బతింటాయని,విద్యాలయాల్లో వేలాది
మంది విద్యార్థులు ఉంటారని,వెంటనే వీటిని తొలగించాలని, పైన పేర్కొన్న విషయాలలో స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంటనే స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నాము.
లేనియెడల ఎంసిపిఐ(యు) పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోరాట కార్యక్రమాలు చేపడతామని అన్నారు.
Comments