కంపెనీ స్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్.
By
Rathnakar Darshanala
కంపెనీ స్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్.
మందమర్రి టౌన్.
మందమర్రి పట్టణంలోని సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో WPS&GA ఆధ్వర్యంలో మంగళవారం రోజున కంపెనీ స్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్ను ఏరియా జిఎం జి. దేవేందర్ ప్రారంభించినారు.
అనంతరం ఏరియా జిఎం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ మన సంస్థ లో ఉన్న 11 ఏరియాల నుండి వచ్చిన క్రీడాకారులకు మరియ అన్ని ఏరియాల స్పోర్ట్స్ సూపర్వైజర్లకు, అధికారులకు, యూనియన్ నాయకులకు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆటల ద్వారా మానసిక మరియు శారీరక ఉల్లాసంతో పాటు శరీర దృఢత్వం కలుగుతుందని అన్నారు. పోటీలలో పాల్గొనే క్రీడాకారులు అందరూ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తో క్రీడల్లో పాల్గొని గెలుపు ఓటములను సమానంగా భావించాలని అన్నారు.
కంపెనీ స్థాయి ఆటలలో గెలుపొందిన క్రీడాకారులు కోల్ ఇండియా పోటీలలో తమ ప్రతిభను కనబరిచి సింగరేణి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.
అలాగే ఈరోజు రేపు ఈ పోటీలలో ఆడి గెలుపొందిన వారికి రేపు బహుమతి ప్రధానము చేయబడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో AITUC బ్రాంచ్ సెక్రెటరీ
S.సత్యనారాయణ, CMOAI అధికారి పైడిశ్వర్,
పర్సనల్ మేనేజర్ S. శ్యాంసుందర్,
స్పోర్ట్స్ సమన్వయకర్త Sr.Po.M. కార్తీక్, స్పోర్ట్స్ సూపర్వైజర్ కార్పొరేట్ పాస్నెట్,
స్పోర్ట్స్ సూపర్వైజర్లు జాన్ వెస్లీ, Ch.అశోక్, H.రమేష్, P. శ్రీనివాస్,
నరేందర్ రెడ్డి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ S. శివ కృష్ణ , జనరల్ క్యాప్టన్ సాక శ్రీనివాస్ మరియు అన్ని ఏరియాల క్రీడాకారులు, అధికారులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
Comments