దండారి చెక్కుల అందజేత.

Rathnakar Darshanala
దండారి చెక్కుల అందజేత.
నేటివార్త,ఖానాపూర్,నవంబర్05: 

 తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీ గూడేల్లో రాజ్ గోండులు దీపావళి సంధర్బంగా నిర్వహించే  దండారి ఉత్సవాలకు ప్రభుత్వం రూ.1.5 కోట్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు దండారికి 15 వేల రూపాయల చొప్పున కేటాయించి ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆదివాసీలకు చెక్కులను పంపిణీ చేశారు.

ఈ క్రమంలోనే ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు మండలంలోని బీర్నంది పంచాయతీ పరిధిలోని 

తుమ్మగూడ,ఇప్పమాడ గూడేలకు స్థానిక కాంగ్రెస్ నాయకులు 2 దండారి చెక్కులను మంగళవారం ఆయా గూడెం ఆదివాసీలకు అందజేశారు.

వారు మాట్లాడుతూ ఆదివాసీల సంక్షేమానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాంచందర్,సుంగు పటేల్, పీఏసిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శి దేవేందర్ రెడ్డి,గూడెం వాసులు తదితరులు పాల్గొన్నారు.
Comments