Adilabad :పెన్షనర్ల సమస్యలను పరిష్కరించండి.

Rathnakar Darshanala
పెన్షనర్ల సమస్యలను  పరిష్కరించండి. 
నేటి వార్త జిల్లా ప్రతినిధి అదిలాబాదు :

 తెలంగాణా ఆల్ పెన్షనర్స్ & రిటైర్టు పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు బుధవారం జిల్లా  యూనిట్ నాయకులు  జిల్లా  కేంద్రంలో ధర్నా నిర్వహింఛారు.

 రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల  సమస్యలు దీర్ఘకాలంగా పరిష్కరించబడడం లేదనీ,. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన తక్షణం ఉద్యోగుల, పెన్షనర్ల సమస్యలు పరిష్కరిస్తామని తమ మ్యానిఫెస్టోలో ప్రకటించారు.. 

ప్రభుత్వం ఏర్పడి దాదాపు 11 నెలలైనా సమస్యలలో కేవలం నెల మొదటి తేదీకి వేతనాలు, పెన్షన్లు చెల్లించడం తప్ప మరేవీ పరిష్కరింపబడలేదనీ . 
పెండింగులో ఉన్న 5 డి ఎ ఎఫ్ డీ ఆర్ లలో కేవలం ఒకటి మాత్రమే యిస్తానని ప్రకటించడం పట్ల ఉద్యోగులు, పెన్షనర్లు నిరాశా, నిస్పృహకు లోవయ్యారన్నారు.

పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదనీ. విధిలేని పరిస్థితిలో తెలంగాణా ఆల్ పెన్షనర్స్ & రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్ దశలవారి ఆందోళనా పోరాట కార్యక్రమం చేపట్టిందన్నారు . 

మొదటి
దశగా నవంబర్ 5,6 తేదీలలో రాష్ట్రంలోని అన్ని ఎస్ టి ఓ / ఏ పి పి ఓ కార్యాలయాల ముందు ధర్నా చేయాలని పిలుపు నిచ్చింది. 

రాష్ట్ర సంఘ పిలుపు మేరకు బుధవారం  ఎస్ టి ఓ / ఏ పి పి ఓ కార్యాలయం ఎదుట టాప్ర యూనిట్ అధ్వర్యంలో ధర్నా చేసారు.

యిట్టి విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తెచ్చి పెన్షనర్ల సమస్యలను సత్వరం పరిష్కరింప జేయడానికి సహకరించవలసినదిగా సంఘ నాయకులు  విజ్ఞప్తి చేశారు.
Comments