జితేందర్ రెడ్డి సినిమా 1984 నుంచి 90లో మధ్య జరిగిన ఏబీవీపీ నాయకుడి కథ.
By
Rathnakar Darshanala
జితేందర్ రెడ్డి సినిమా 1984 నుంచి 90లో మధ్య జరిగిన ఏబీవీపీ నాయకుడి కథ.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జిల్లాలోని మండలం మల్యాల గ్రామం మ్యాడం పల్లి
నేటి వార్త మల్యాల ప్రతి నిధి.
దొనకొండ రమేష్.
అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇప్పటి జగిత్యాల జిల్లా మల్యాల మండలం లోని మ్యాడంపల్లి లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తీసిన సినిమా
ప్రజాస్వామ్యం పై నమ్మకం లేని, హింస పైనే నమ్మకం ఉన్న కమ్యూనిస్టు తీవ్రవాదమే నక్సలిజం! మాతృదేశం గురించి తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా,
నక్సలైట్ తీవ్రవాదులను ఎదుర్కొని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి భారతమాత సేవలో బలిదానమైన మహనీయుల గురించి ఈ తరానికి పరిచయం చేయడమే ఈ సినిమా ఉద్దేశం!
1980...
భూమి కోసం, భుక్తి కోసం, దొరల దౌర్జన్యాల అంతం కోసం అని మొదలు పెట్టిన నక్సల్ సిద్దాంతం దారి తప్పింది. హింసాయుత భావజాలాన్ని ప్రశ్నించిన ప్రతి వారినీ హతమార్చారు.
జాతీయ వాదులైన RSS మరియు దాని అనుబంధ సంస్థ ABVP కార్యకర్తలపై దాడులు చేశారు.
19.02.1984 లో కిసాన్ సంఘ్ నాయకుడు గోపన్న మరియు RSS నాయకుడు రామన్న లను నక్సలైట్లు హతమార్చారు. ఈ హత్యలు జితేందర్ రెడ్డి ని కలువర పరిచాయి.
1980-90 మద్య 50 మందికి పైగా జాతీయ వాదుల్ని నక్సలైటు చంపేశారు.
జితేందర్ రెడ్డి సినిమాలో, జితేందర్ రెడ్డి కి స్ఫూర్తినిచ్చిన రామన్న, గోపన్నల బలిదానం తోపాటు మెట్ పల్లి లో ఏబీవీపీ నాయకుడు మధుసూదన్ గౌడ్ బలిదానం,
అలాగే వరంగల్ కాకతీయ యూనిర్సిటీలో మన జాతీయ జెండాను రాడికల్స్ అవమానపరుస్తుంటే అడ్డుకున్నందుకు నక్సలైట్ తీవ్రవాదులు చేసిన దాడిలో అమరుడైన సామ జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా చూపించబడింది!
ఒక్కొక్కరిగా జాతీయ వాదులను తీవ్రవాదులు నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంటే సహించ లేక పోయిన కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన
యువ ఏబీవీపీ నాయకుడు ముదుగంటి జితేందర్ రెడ్డి నక్సలైట్ల దౌర్జన్యాలను అడ్డుకుంటూ వారికి సింహ స్వప్నంగా మారాడు. జితేందర్ రెడ్డికి భయపడి దాదాపు 5 సంవత్సరాలు నక్సలైట్ల దళ సభ్యులు ఎవరూ జగిత్యాల ప్రాంతంలో ప్రవేశించడానికి సాహసించలేదు.
చావు కళ్ళ ముందున్నా తనను చంపడానికి వచ్చిన నక్సలైట్ల తో ఒంటరిగా రెండు గంటల పైగా పోరాటం చేసి అమరుడయ్యాడు.
జితేందర్ రెడ్డి జీవితంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం నిర్మించబడినది.
జితేందర్ రెడ్డి అమరుడైనా అతని ఆశయం ఆగిపోలేదు. అతను చిందించిన ఒక్కొక్క రక్తపు బొట్టు నుండి వేలాదిగా జాతీయ వాదులు పుడుతూనే ఉన్నారు.
అందుకే.
దశాబ్దాలు గడిచినా ఎప్పటికీ గుర్తించు కోవాల్సిన అమరుడు జితేందర్ రెడ్డి చరిత్ర నేటి తరానికి చెప్పాల్సిన అవసరం ఉంది.
హిస్టరీ నీడ్స్ టూ బి టోల్డ్
దొంగ లను, స్మగ్లర్లను, నక్సలైట్ల వంటి జాతి వ్యతిరేక శక్తుల చరిత్ర ఆధారంగా స్టార్ హీరో లతో సినిమాలు తీస్తూ యువతను తప్పు దారి పట్టిస్తున్న.
ఈ రోజులలో జాతీయ వాద సిద్ధాంతం కోసం భారత మాత ఒడిలో తన ప్రాణాలు తృణ ప్రాయంగా అర్పించి అమరుల చరిత్ర ఆధారంగా నిర్మించిన జితేందర్ రెడ్డి సినిమాను ప్రతి భారతీయుడు తప్పకుండా చూడాలి.
Comments