America :అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.

Rathnakar Darshanala
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.
* భారీ మెజార్టీతో రెండోసారి గెలుపు

* కనులా హ్యారిస్ పై ఆధిక్యం ప్రదర్శన

* నాలుగేళ్ల విరామం

తరవాత మళ్లీ వైట్ హౌశకు రాక.

* ట్రంప్్కు కలిసి వచ్చిన బైడెన్ వైఫల్యాలు

న్యూయార్క్, నవంబర్ 6 నేటివార్త :

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. ఎన్నికల పోరులో ఎదురీది విజయం సాధించారు. అమెనికన్లను ఆకట్టుకుని విజేతగా నిలిచారు. 

అమెరికాలోని పత్రికలు జరిపిన సర్వేలన్నీ ఆయనకు వ్యతిరేకమని తేల్చినా.. ప్రజలు మాత్రం అండగా నిలిచారు. కొంత విరామంతో ఒక అభ్యర్థి అమెరికా అధ్యక్ష స్థానంపై తిరిగి కూర్చోవడం 131 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. 

అంతేకాదు.. ఎన్నికలకు ముందు కోర్టు కేసులు ఇబ్బంది పెట్టినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా చివరి వరకూ పోరాడారు. 

2016 నాటి ఫలితాలకు భిన్నంగా ఈసారి పాపులర్ ఓటు కూడా ట్రంప్ ్నకే లభించింది. ఆయనకు దాదాపు 51 శాతానికి పైగా ఓట్లు లభించగా.. ప్రస్తుత

ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ 47 శాతం వద్దే ఆగిపోయారు. సంప్రదాయ రిపబ్లికన్ రాష్ట్రాలను నిలబెట్టుకోవడంతో పాటు.. 

గంపగుత్తగా స్వింగ్ స్టేట్స్ ఏడింటా ట్రంప్ హవా నడిచింది. ముఖ్యంగా అమెరికాలో ద్రవ్యోల్బణం, ఉద్యోగాలు, వేతనాలు, 

అక్రమ చొరబాట్లు వంటి అంశాలు ఈ ఎన్నికల్లో తిరుగులేని విధంగా ప్రభావాన్ని చూపాయి. అరణ్, ముస్లింలు అధికంగా ఉన్న జార్జియాలో ఈసారి మొదటి నుంచి కమలా హారిస్ వెనుకంజ లోనే ఉన్నారు. 

గతంలో ఇక్కడ బైడెన్ హవా నడిచింది. కానీ, గాజా యుద్ధం విషయంలో డెమోక్రాట్ల వైఖరిపై వీరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, వీరిని బుజ్జగించేందుకు కమలా హారిన్ ప్రచారం చేసిన అంతగా ఫలించలేదు.
Comments