నేటి నుంచి బెల్లంపల్లిలో ఎస్జీఎఫ్ అండర్ 19 సాఫ్టు బాల్ రాష్ట్ర స్థాయి పోటీలు.

Rathnakar Darshanala
నేటి నుంచి బెల్లంపల్లిలో ఎస్జీఎఫ్ అండర్ 19 సాఫ్టు బాల్ రాష్ట్ర స్థాయి పోటీలు.
- క్రీడా మైదానాన్ని పరిశీలించిన 

డీఐఈవో కటకం అంజయ్య.

బెల్లంపల్లి, నవంబర్ 7, 
నేటివార్త :

నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు బెల్లంపల్లి పట్టణంలోని బాలగంగాధర్ తిలక్ మైదానంలో  స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అండర్ 19 సాప్ట్ బాల్ పోటీలు ప్రారంభం కానున్నాయి. 

ఈ మేరకు పోటీలు నిర్వహిస్తున్న బాల గంగాధర్ తిలక్ క్రీడా మైదానాన్ని జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి కటకం అంజయ్య గురువారం పరిశీలించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీల నిర్వహణకు తగు ఏర్పాట్లు చేయాలని ఎస్ జి ఎఫ్ జిల్లా సెక్రెటరీ బొంకూరి బాబురావు ను,ఆర్గనైజింగ్ కమిటీ ని ఆదేశించారు. 

ఈ సందర్భంగా డిఐ ఈ వో మాట్లాడుతూ బెల్లంపల్లిలో రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలు నిర్వహించడం గొప్ప గర్వకారణం అన్నారు.

 ఈ పోటీలకు రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ కరీంనగర్, నల్గొండ ,రంగారెడ్డి నిజామాబాద్ ,వరంగల్ హైదరాబాద్, 

ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి దాదాపు 320 మంది క్రీడాకారులు హాజరు కావడమే కాకుండా బాలికలు 10, బాలురు 10 జట్లు పాల్గొంటారని ఆయన వివరించారు.

ఈ పోటీలు శుక్రవారం సాయంత్రం ప్రారంభమవుతాయని తెలిపారు. .

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్,స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్,బెల్లంపల్లి ఆర్డీఓ పి.హరికృష్ణ ,మున్సిపల్ ఛైర్పర్సన్ జక్కుల శ్వేత 
లను ఆహ్వానించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. 

ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు,  ప్రిన్సిపల్ అవునూరి అంజయ్య, రామ్మోహన్, బండి రవి, ఎస్ కె రాజ్ మహ్మద్, ఎం డీ చాంద్ పాషా,
హరి,సాయి తదితరులు పాల్గొన్నారు.
Comments