Nirmal jilla :బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి.

Rathnakar Darshanala
బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి.
*ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే దీపావళిని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని*

*నిర్మల్ జిల్లా.. ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్*
నిర్మల్ జిల్లా నేటి వార్త 27.10.2024.

అనుమతులు లేకుండా బాణాసంచా దుకాణాలను ఏర్పాటు చేస్తే ప్రేలుడు పదార్థాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల  హెచ్చరించారు. 

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ నిర్మల్ జిల్లా పట్టణ పరిసర ప్రాంత పరిధి లోని ఆయా గ్రామాలలో  ఎలాంటి అనుమతులు లేకుండా బాణాసంచా దుకాణాలను ఏర్పాటు చేసిన,

 సరైన భద్రతా ప్రమాణాలు లేకుండా దుకాణాలు ఏర్పాటు చేసిన, విక్రయాలు జరిపిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ  హెచ్చరించారు. 

దీపావళిని పురస్కరించుకుని బాణాసంచా తయారీ, విక్రయదారులపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా విక్రయాలు జరిపితే చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ   అన్నారు.
Comments