మనం చదివే విద్య ఎప్పటికి వృధా పోదు - ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్.

Rathnakar Darshanala
మనం చదివే విద్య ఎప్పటికి వృధా పోదు - ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్.

నేటివార్త జగిత్యాల బ్యూరో ఆక్టోబర్ 27 :


మనం చదివే విద్య ఎప్పటికి వృధా పోదని ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు.

 జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆదివారం ఓ ఫంక్షన్ హలో నిర్వహించిన పట్టభద్రుల ఉద్యోగ కల్పనే ధ్యేయంగా  అల్ఫోర్స్ విన్ఆర్ఈ  క్లాసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో  ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్  పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన యాప్ ను అల్ఫోర్స్ విద్యసంస్థల చైర్మన్ నరేందర్ తో కలిసి ఆయన ప్రారంభించారు.

అనంతరం వారు మాట్లాడుతూ
అల్ఫోర్స్ విన్ఆర్ఈ  క్లాసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాల సంతోషంగా ఉందని నరేందర్ రెడ్డి నాకు చాలా అప్తులని,భవిష్యత్తులో ఉచిత కోచింగ్ క్లాసులు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని వారు చెప్పడాన్ని అభినందిస్తున్నామని తెలిపారు. 

దానల్లో విద్య దానం గొప్పదని, మనం చదివే విద్య అనేది ఎప్పుడూ వృథాగా పోదని ,అది ఎక్కడో ఏదో సమయంలో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 

ఉన్నతమైన చదువులు చదివిన వ్యక్తి ఒక ప్రజాప్రతినిధి అయితే వారి విధానాల ద్వారా అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మేలు జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయని దానికి ఉదాహరణగా మంత్రివర్యులు శ్రీధర్ బాబుని తెలియజేశారు. 

కాబట్టి విద్య విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యం తగదని,రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు .ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments