రామగుండం ,రుడాగా, మార్చడానికి గ్రీన్ సిగ్నల్! జీవో జారీ చేసిన మున్సిపల్ కార్యదర్శి దాన కిషోర్.
By
Rathnakar Darshanala
రామగుండం ,రుడాగా, మార్చడానికి గ్రీన్ సిగ్నల్! జీవో జారీ చేసిన మున్సిపల్ కార్యదర్శి దాన కిషోర్.
(జేమ్స్ రెడ్డి నేటి వార్త ప్రతినిధి రామగుండం నియోజకవర్గం అక్టోబర్ 27)
తెలంగాణ రాష్ట్రం లోని రామగుండం కార్పొరేషన్ ఏరియాని ,రుడా గా, మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీనికి సంబంధించిన జీవో నెంబర్ 165 ను మున్సిపల్ కార్యదర్శి దాన కిషోర్ విడుదల చేశారు.
తద్వారా రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రూడా తో పాటు, పెద్దపల్లి మంథని సుల్తానాబాద్ మున్సిపాలిటీల తో పాటు 198 గ్రామాలు విలీనం చేస్తూ మున్సిపల్ కార్యదర్శి 165 జీవో నోటిఫికేషన్ ద్వారా విడుదల చేస్తారు.
దీంతో రామగుండం కార్పొరేషన్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రూడాగా రూపొంద పోతుంది,
ఏది ఏమైనా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ మక్కాన్సింగ్ ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ద్వారా రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడి మున్సిపల్ అధికారులను మెప్పించి రామగుండాలి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రుడ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.
ఇది ఇలా ఉంటే రామగుండం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్న ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ట్రెజరరీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఇదే కాకుండా రామగుండంలో ప్రజాభివృద్ధికి ఉపయోగపడే కార్యాలయాలు నిరుద్యోగ యువతకు ఉపయోగపడే పరిశ్రమలు తేవడమే లక్ష్యంగా ముందుకు పోతున్నారు.
రోడ్లను వెడల్పు చేసి రామగుండం సుందరవనంగా తీర్చిదిద్దే లక్ష్యంలో మడమ తిప్పకుండా నిష్పక్షపాతంతో ముందుకు దూసుకెళుతున్నారు,
Comments