Nirmal jilla :ఎల్ఆర్ఎస్ ఎంట్రీ త్వరితగతిన పూర్తి చేయాలి.
By
Rathnakar Darshanala
ఎల్ఆర్ఎస్ ఎంట్రీ త్వరితగతిన పూర్తి చేయాలి.
నేటివార్త,ఖానాపూర్,అక్టోబర్26:
ఎల్ఆర్ఎస్ కి దరఖాస్తు చేసుకున్న యజమానులు త్వరితగతిన ఆన్లైన్ చేసుకోవాలని ఖానాపూర్ మండల ఎంపీఓ చిక్యాల రత్నాకర్ రావు అన్నారు.
మండల ఎంపిడిఓ సునీత, ఎంపీఓ రత్నాకర్ రావు,ఆర్ఐ,ఏఈ లు శనివారం మండలంలోని మస్కాపూర్ గ్రామంలో పర్యటించి గ్రామంలోని లేఅవుట్ ను పరిశీలించారు.
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి గడువులోగా ఆన్లైన్ ఎంట్రీ చేయాలని ఎంపీఓ పంచాయతీ కార్యదర్శికి సూచించారు.
మండలంలో ఎల్ఆర్ఎస్ 1648 దరఖాస్తులు ఉండగా అత్యధికంగా మస్కాపూర్ గ్రామంలోనే 1527 ఉన్నాయని ఎంపీఓ రత్నాకర్ రావు తెలిపారు.
ప్లాట్ యజమానులు అవసరమగు పత్రాలను పంచాయతీ కార్యదర్శికి త్వరితగతిన చూపించి ఎల్ఆర్ఎస్ ఆన్లైన్ చేయించుకోవాలని దరఖాస్తుదారులను కోరారు.
Comments