పేద ప్రజలకు వరం సీఎం సహాయనిధి.
By
Rathnakar Darshanala
పేద ప్రజలకు వరం సీఎం సహాయనిధి.
నేటి వార్త వేములవాడ నియోజక వర్గం ప్రతినిధి మల్లేశం గౌడ్
భీమారం మండల కేంద్రానికి చెందిన పలువురు అనారోగ్యంతో ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందగా వారికి
ఆర్థిక సాయం కోసం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు.పల్లి చిన్నోళ్ళ ధర్మయ్య కి 21500, ఒళ్ళాల గంగు కి 40.000,బిళ్ళ గంగరాజం కి 32500,పల్లి వెంకట్రాజు కి 47000 రూపాయలు
వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో మంజూరైన
చెక్కును కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బక్కూరి నరేష్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు
బాధిత కుటుంబాలకు చెక్కును అందజేశారు.
కుటుంబ సభ్యులు ఆది శ్రీనివాస్ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశాంత్, సంజీవ్, స్వామి రెడ్డి ,గండి శ్రీనివాస్ ,రాజేందర్,
ధ్యావనపెల్లి.రాకేష్, హైమత్,ప్రదీప్, కార్తీక్ గౌడ్
నాయకులు తదితరులు పాల్గొన్నారు
Comments