Nirmal jilla :డీఎస్పీ కార్యకర్తల మహా సమ్మేళన కరపత్రాలు విడుదల.
By
Rathnakar Darshanala
Nirmal jilla :డీఎస్పీ కార్యకర్తల మహా సమ్మేళన కరపత్రాలు విడుదల.
నేటివార్త,ఖానాపూర్,అక్టోబర్25:
ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తల మహా సమ్మేళనం కరపత్రాలు శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినిట్యాంక్ బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వద్ద విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా ప్రచార కమిటీ సభ్యులు రామగిరి రవీందర్ మాట్లాడుతూ నవంబర్ 3న హైదరాబాదులోని ఆదిభట్ల పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఈ మహా సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సమ్మేళనంలో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టనున్న పార్టీ కార్యక్రమాలు, ప్రణాళికలు కార్యకర్తల సమక్షంలో పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహరాజ్ వెల్లడిస్తారని పేర్కొన్నారు.
90 శాతం ఉన్న బీసీ,ఎస్సీ,ఎస్టీలకు రాజ్యం లేక విద్యా వైద్యం ఉపాధి,ఇల్లు, భూమి ఏమి లేకుండా పోయాయని అన్నారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ ల సంక్షేమం ధర్మ సమాజ్ పార్టీ తోనే సాధ్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు రాజు మహారాజ్, సొన్న భూమేష్ ,కత్తి శేకర్లు పాల్గొన్నారు.
Comments