Hydarabad :మూసి బాధితులకు అండగా బిజెపి మహా ధర్నా.
By
Rathnakar Darshanala
Hydarabad :మూసి బాధితులకు అండగా బిజెపి మహా ధర్నా.
*-శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీగా తరలిన బీజేపీ శ్రేణులు*
నేటి వార్త, శేరిలింగంపల్లి:
మూసి పరివాహక ప్రాంతంలో పేదల ఇండ్ల కూల్చివేతలను అడ్డుకొని ప్రజల ఆస్తులను పరిరక్షిస్తాం అని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నియోజకవర్గ ఇన్చార్జ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ అన్నారు.
శనివారం భారతీయ జనతా పార్టీ రథసారథులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మూసి బాధితులకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది అని తెలుపుతూ,
ధర్నా చౌక్ ఇంద్ర పార్క్ వద్ద మహా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి రవి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి డివిజన్ల వారీగా పెద్ద ఎత్తున చేరుకున్నారు.
అనంతరం రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చడానికి ఎన్నెన్నో నాటకాలు ఆడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉండి హైడ్రా పేరుతో హైడ్రామాలు చేస్తూ పేదల ఇండ్లను కూలుస్తూ వారు కన్న కలలను కాల రాస్తున్నారని,
ఈ ప్రభుత్వం పేదోళ్ల ప్రభుత్వం కాదని- పెద్దొల్ల ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కనుసైగల్లో పనిచేసే ప్రభుత్వం అని మండిపడుతూ పేదవారి కోసం భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని వారు తెలిపారు.
రేపు రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల విషయంలో చుక్కలు చూపిస్తుందని రవి కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ రాఘవేంద్రరావు, ఎల్లేష్, రమేష్, వసంత్ యాదవ్ ,రాధాకృష్ణ యాదవ్, ఆంజనేయులు సాగర్, శ్రీనివాస్, నరసింహ చారి, నర్సింగ్ యాదవ్, సురేష్ ,రాజు, ఆంజనేయులు యాదవ్,రమణయ్య, అజిత్ తదితరులు పాల్గొన్నారు.
Comments