అర్హత గల ప్రతి కుటుంబానికి విశ్వకర్మ యోజన ద్వారా బ్యాంకు రుణాలను అందజేస్తాం. MLA పాయల్ శంకర్.

Rathnakar Darshanala
అర్హత గల ప్రతి కుటుంబానికి విశ్వకర్మ యోజన ద్వారా బ్యాంకు రుణాలను అందజేస్తాం. MLA పాయల్ శంకర్.
ఆదిలాబాద్ బ్యూరో నేటి వార్త :జన శిక్షణ సంస్థాన్ అదిలాబాద్ వారిచే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన లబ్ధిదారులకు శిక్షణలు ఇచ్చి అట్టి శిక్షణ పొందిన వారికి,

శిక్షణ సర్టిఫికెట్లను అందజేయుటకు ఏర్పాటు చేయబడిన సమావేశంలో గౌరవ ఎమ్మెల్యే అదిలాబాద్ శ్రీ పాయల్ శంకర్ గారు పాల్గొని విశ్వకర్మ యోజన కులవృత్తులతో జీవించుచున్న కుటుంబాల కొరకు వారి నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి అధునాతన పరికరములు/పనిముట్లను అందజేసి బ్యాంకుల నుండి లక్ష నుండి మూడు లక్షల వరకు కేవలం ఐదు శాతం వడ్డీతో రుణాలు అందజేయుటకు కులవృత్తుల వారిని ప్రోత్సహించుటకు కేంద్ర ప్రభుత్వం వారు విశ్వకర్మ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించినారని తెలియజేసిరి. 

అర్హులు అయిన 18 రకాల కులవృత్తుల వారు ఇట్టి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆత్మ నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవాలని ప్రభుత్వం వారిచే ఇవ్వనున్న బ్యాంక్ సహకారాలను సద్వినియోగం పరుచుకోవాలని తెలియజేసిరి. 
బ్యాంక్ అధికారులతో ఏమైనా ఇబ్బందులు ఉన్నచో తాను స్వయంగా వచ్చి రుణాలను అందజేస్తానని తెలియజేసిరి. 

జన శిక్షణ సంస్థాన్ ద్వారా ఇంతవరకు 3 బ్యాచుల వారికి శిక్షణ ఇవ్వనైనది ప్రస్తుతం శిక్షణ పొందిన వారికి జన శిక్షణ సంస్థాన్ వారు గౌరవ ఎమ్మెల్యే గారిచే శిక్షణ పొందిన అభ్యర్థుల యొక్క సర్టిఫికెట్లను లబ్ధిదారులకు అందజేసిరి. 

ఇట్టి సమావేశంలో జన శిక్షణ సంస్థాన్ వారు అందజేయుచున్న ఉపాధి కల్పన శిక్షణ పొందిన వారికి కూడా ఈ సందర్భంగా సర్టిఫికెట్స్ ఇవ్వనైనది. 

ఇట్టి సమావేశంలో జిల్లా పారిశ్రామిక కేంద్రం యొక్క జనరల్ మేనేజర్ శ్రీ పద్మభూషణ్ రాజుగారు, విశ్వకర్మ యోజన జిల్లా మేనేజర్ రాజేందర్ గారు , జన శిక్షణ సంస్థ చైర్మన్ ఆ.ర్ సురేందర్ గారు జన శిక్షణ సంస్థాన్ డైరెక్టర్ ఎం. శ్యామల మరియు తదితరులు పాల్గొన్నారు.
Comments