ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన అల్లీపూర్ విద్యార్థిని.
By
Rathnakar Darshanala
ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన అల్లీపూర్ విద్యార్థిని.
నేటి వార్త రాయికల్ అక్టోబర్ 26:
జగిత్యాలలో జరిగిన జిల్లా స్థాయి పాఠశాలల అండర్ 17 బాలికల కబడ్డీ పోటీల్లో,
అల్లీపూర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన ఏం.డి. కామర్ సుల్తానా అత్యంత ప్రతిభ కనబరచి ఈ నెల 27న రాజన్న సిరిసిల్ల జిల్లా కోడూరుపాక లో జరిగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా కబడ్డి పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు ఎం. శ్రీనివాస్ తెలిపారు.
ఎంపికైన విద్యార్థినిని ఉపాధ్యాయులు గ్రామపెద్దలు అభినందించారు.
Comments