రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో గాయత్రి విద్యానికేతన్ విద్యార్థినీల ప్రతిభ.

Rathnakar Darshanala
రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో గాయత్రి విద్యానికేతన్ విద్యార్థినీల ప్రతిభ.
(ఇనుగంటి సంతోష్ రావు) నేటి వార్త పెద్దపల్లి టౌన్ 26:

తెలంగాణ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల వరంగల్ లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్ షిప్ 

(బాలికలు) లో పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ కి చెందిన అల్లెంకి మహాలక్ష్మి (9వ), పడాల హాసిని (9వ) మరియు ఎ. లాస్య ప్రియ (8వ) లు  పాల్గొని తమ ప్రతిభ చూపి ప్రశంసా పత్రాలు అందుకున్నారు.

 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కేవలం చదువు ఒక్కటే కాకుండా ఇలాగే ఆటల్లో కూడా ప్రతిభ చూపిస్తూ ముందు ముందు మరెన్నో పతకాలు సాధించి తల్లిదండ్రులకు, 

పాఠశాలకు తద్వారా మన జిల్లా కు గొప్ప పేరు తీసుకొని రావాలని కోరి, వారికి ప్రశంసా పత్రాలు అందజేసి ప్రతిభ చూపిన విద్యార్థులను, కృషి చేసిన పి.ఇ.టి. స్రవంతి లను అభినందించారు. 

విద్యార్థుల లక్ష్య సాధన దిశలో గాయత్రి విద్యా సంస్థల యాజమాన్యం సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ విజయ్ పాల్గొన్నారు.
Comments