KTR దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పాల్గొన్న ఆత్రం సుగుణక్క.

Rathnakar Darshanala

KTR దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పాల్గొన్న ఆత్రం సుగుణక్క.
గుడిహత్నూర్ నేటి వార్త : రైతులను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జీ ఆత్రం సుగుణక్క మండిపడ్డారు. 

గురువారం ఆదిలాబాద్ పట్టణంలో బారాసా నిర్వహించిన సభలో కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ మాట్లాడిన మాటలను వ్యతిరేకిస్తూ శుక్రవారం గుడిహత్నూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదుట కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

 కేటీఆర్ డౌన్ డౌన్, బిఆర్ఎస్ డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ పదేళ్ల బారాస పాలనలో రైతు వ్యతిరేక విధానాలను అవలంబించిన బారాస నాయకులు ఇప్పుడు రైతులపై ప్రేమ ఒలకబోస్తున్నారని వండిపడ్డారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది నెలల్లోపే ఇచ్చిన హామీలను అమలు చేయడాన్ని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ లేనిపోని ఆరోపణలు చేస్తుందని విమర్శించారు.

ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గడువులోగా రుణమాఫీ చేసి పాలనలో తమ మార్క్ ఎలా ఉంటుందో కాంగ్రెస్ ప్రభుత్వం చూపించిందని అన్నారు.రుణమాఫీ ఎట్ల చేస్తరు? అసలు సాధ్యం కానే కాదు? అన్నోళ్ల నోర్లు మూయించాం.
 ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో  రూ. 2 లక్షల రుణమాఫీ చేసి చూపించామని,ఇప్పుడు విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు పదేండ్లలో పది వాయిదాల్లో కూడా రుణమాఫీ పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు.

కెసిఆర్ గతంలో సన్న వడ్లు పండించాలని,రూ.100 బోనస్ కూడా ఇస్తామని చెప్పి మోసం చేశాడని,రైతులను ప్రోత్సహించడానికి,

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సన్న వడ్ల సాగు పెంచేందుకు రూ.500 బోనస్ ఇస్తామంటే కెసిఆర్ కుటుంబానికి ఎక్కడలేని బాధ కలుగుతుందని అన్నారు.రైతులను గోస పెట్టి, ప్రజాధనాన్ని కొల్లగొట్టి రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పులపాలు చేశాడని, 

ఇప్పుడు మళ్ళీ ప్రజలను మభ్య పెట్టేందుకు కెసిఆర్, కెటిఆర్, హరీష్‌రావు సంక్రాంతి గంగిరెద్దుల్లా పోటీ పడుతున్నారని అన్నారు.మీ ఆగడాలు,

 మీ అబద్దాలకోరు మాటలు భరించలేక రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చీ కొట్టి  కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని గద్దనెక్కించారు. అయినా మీ బుద్ధి మారటం లేదు.డబుల్ బెడ్ రూమ్,దళిత బంధు, మూడెకరాల భూమి, 

ఇంటికో ఉద్యోగం, నీళ్లు నిధులు,నియామకాలు అని పదేళ్లు పాలించి ప్రజలను  మోసం చేశారని అన్నారు. రైతుల కోసం కేటీఆర్ జైలుకెళ్లటానికి సిద్ధమని చెప్పటాన్ని  ఖండించారు. 

గతంలో మీరిచ్చిన వాగ్దానాల ప్రకారం రైతులకు రుణమాఫీ చేయనందుకు, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వనందుకు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3,000 మంది ఆత్మహత్య చేసుకుంటే ఏ ఒక్కరిని ఆదుకోనందుకు మీరు జైలుకు వెళ్తానని ఒప్పుకున్నట్లు ఉందని విమర్శించారు.

2004లో ఉచిత విద్యుత్ ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ అని, 2024లో 24గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేదే కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తోనే ప్రజాసంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.

ప్రజలు ఎవరు కూడా బారాస నాయకుల మాటలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్యాల కరుణాకర్,వర్కింగ్ ప్రెసిడెంట్  ఎండి షాహిద్,మాజీ ఎంపీటీసీ అంకతి రవి ,జయరాం మండల ఉపాధ్యక్షులు ఆరిఫ్ ఖాన్ ప్రధాన కార్యదర్శి శ్యామ్ రావు గణేష్ గౌడ్ మండల ఎస్సి, ఎస్టీ   సెల్అధ్యక్షులు  దుబాక నరేష్, భీర్శబ్  మార్కెట్ కమిటీ డైరెక్టర్ మజీద్ యూత్ అధ్యక్షులు విష్ణు  మండల మహిళా అధ్యక్షురాలు అనసూయ కార్యదర్శి లలిత గంగమణి ,

యూత్ కాంగ్రెస్ మహేందర్ మండల సీనియర్ నాయకులు రవి ముండే  ససనే మాధవ్  శంకర్ గోవింద్, చత్రుగన్  కత్లె రామదాస్ ఆవుల రమేష్,సురేష్, పునజీ ,విష్ణు , కాకిడే  ఎక్నాథ్ పటేల్    .తొడసం రవి   నాయకులు రమేష్ రాథోడ్ ,కృష్ణ మాలాజీ రాథోడ్ సుభాష్  సిడం శంకర్, నాగోరావు, గణేష్, జంగు సంజీవ్ ముస్తఫా శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments