Ap :కల్తీ వరి విత్తనాల వల్ల నష్టపోయిన రైతాంగా న్ని ఆదుకోండి.
By
Rathnakar Darshanala
Ap :కల్తీ వరి విత్తనాల వల్ల నష్టపోయిన రైతాంగా న్ని ఆదుకోండి.
వ్యవసాయ అధికారులు వెంటనే పంట పొలాలను పరిశీలించాలి.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్.
నేటి వార్త అక్టోబర్ 25 రుద్రవరం.
కల్తీ వరి విత్తనాలు వేసి నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది .
ఈ మేరకు రుద్రవరం మండలం చిన్న కమ్మలూరు గ్రామంలో వరి పంట వేసి కల్తీ విత్తనాల వల్ల తీవ్రంగా నష్టపోయిన పంట పొలాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ . రాజశేఖర్ , జిల్లా సహాయ కార్యదర్శి సురేష , చిన్న కమ్మలు రు గ్రామరైతులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతులు రైతు సంఘం నాయకులతో మాట్లాడుతూ.ఈ ఖరీఫ్ సీజన్లో నంద్యాల సోనా వరి విత్తనాలను నంద్యాలలోని నీలకంటేశ్వర సీడ్స్ షాపు నందు కొనుగోలు చేసి వరి నాట్లువేశామని,
ఇప్పటివరకు ప్రతి ఎకరాకు సుమారు రూ45వేల రూపాయల వరకు పెట్టుబడిగాపెట్టామని, పంటచేతికి వచ్చే దశలో ఉన్న తమ పొలాలను పరిశీలిస్తే ఒకేసారి గావెన్ను విరవడం లేదని, వెన్ను వచ్చిన వరి కంకులను పరిశీలిస్తే అత్యధిక భాగం కల్తీ వరి విత్తనాలు వున్నాయని,
కొన్ని కర్రలు ప్రస్తుతం పొట్టతో ఉంటే, మరికొన్ని కర్రలు పాలు పోసుకుంటున్నాయని, మరికొన్ని ఎర్రవడ్లుగా మారి రాలిపోతున్నాయని ఫలితంగా మా పంట దిగుబడి తగ్గిపోతుందని,
వచ్చిన దిగుబడిలో కూడా మూడు ,నాలుగు రకాలుగా వడ్లు ఉండడంవల్ల వ్యాపారస్తులు కొనుగోలు చేయరని, చేసిన అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. ఫలితంగా మేమంతా తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు శుక్రవారం తమ ఆవేదనను రైతు సంఘం నాయకులు వెళ్ళబుచ్చారు.
ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ రుద్రవరం మండలంలో 1000 ఎకరాలు పైగా, 50 మందికి పైగానే రైతులు కల్తీ నంద్యాల సోనా విత్తనాలు వాడకం వల్ల తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందని,
జిల్లా, మండల వ్యవసాయ అధికారులు వెంటనే జక్యం చేసుకొని చిన్న కమ్మలూరు గ్రామంలో కల్తీ వరి విత్తనాల వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించాలని,
వరి విత్తనాలు విక్రయించిన నీలకంటేశ్వర సీడ్స్ షాప్ యజమాని పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని, షాపు యజమాని ద్వారా రైతులకు నష్టపరిహారం ఇప్పించి రైతుల నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే రైతులు మరియు సీడ్ కంపెనీల యాజమాన్యం తో చర్చలు జరిపి రైతులు పండించిన నకిలీ వరి ధాన్యాన్ని కంపెనీవారే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వం మరియు అధికారుల నిర్లక్ష్యం జరిగితే రైతుల కు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నష్టపోయిన రైతులు తలారి బాలు. నందయ్య, కుమ్మరి మద్దయ్య, శివ కృష్ణ, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments