Jagityala : ప్రైవేట్ ఆసుపత్రుల పై జాతీయ మానవ హక్కుల మండలికి ఫిర్యాదు.
By
Rathnakar Darshanala
Jagityala : ప్రైవేట్ ఆసుపత్రుల పై జాతీయ మానవ హక్కుల మండలికి ఫిర్యాదు.
నేటివార్త జగిత్యాల బ్యూరో ఆక్టోబర్ 21:
తెలంగాణలోని అన్ని జిల్లాలో ప్రవేట్ ఆసుపత్రులలో అక్రమాలు చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ప్రజా మనుగడ ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో ఇట్టి ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని,
నేషనల్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు సోమవారం జాతీయ మానవ హక్కుల మండలికి ఫిర్యాదు చేశారు.
ఆస్పత్రిలో ఫార్మసీ సర్టిఫికెట్ ఒకరి పేరుతో ఉండి మందులు అవగాహన లేనివారితో ఇస్తు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని అదేవిధంగా స్కైనింగ్ సెంటర్లతో లోపాయికారి ఒప్పందం కుదర్చుకొని ఆసుపత్రి యజమాన్యాలు పేద ప్రజల నడ్డి విరుస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
చాలా ప్రైవేటు ఆసుపత్రులు ఫైర్ సేఫ్టీ బయో మెడికల్ వేస్టేజ్ బిల్డింగ్ పర్మిషన్ వంటి నిబంధనలు పాటించడం లేదని వారు తెలిపారు. నేషనల్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు నక్క గంగారాం పట్టణ అధ్యక్షులు దేవి సింగ్ రాథోడ్ నియోజకవర్గ ఇన్చార్జ్
సంగీపు ముత్తు మరియు సభ్యులు ఉన్నారు.
Comments