Ap గంగపుత్రుల అభివృద్ధి కి కృషి.

Rathnakar Darshanala
గంగపుత్రుల అభివృద్ధి కి కృషి.
 జిల్లా అధ్యక్షులు పుట్ట శివ.

నంద్యాల ప్రతినిధి నేటి వార్త అక్టోబర్ 24: 

గంగపుత్రల అభివృద్ధి కి నా వంతు సహాయ సహకారాలు అందిస్తామని కొత్తగా ఎన్నికైన జిల్లా గంగపుత్రుల జిల్లా అధ్యక్షులు పుట్ట శివ పేర్కొన్నారు. 

నంద్యాల జిల్లా బెస్త,తెలుగు, గంగపుత్రుల ఆత్మీయ సమ్మేళనము గురువారం నాడు ప్రధానందీశ్వర దేవస్థానము వైయస్సార్ మండపం నందు నిర్వహించారు. 

ముఖ్య అతిథిగా మార్కెట్ ప్రసాద్ పాల్గొన్నారు .ఆత్మీయ సమ్మేళనంలో,కుల పెద్దలు, కుల బాంధవులు అందరి అభిప్రాయ సేకరణతో నంద్యాల పాత బెస్తసేవ కమిటీని రద్దు చేశారు. 

 నంద్యాల జిల్లా కొత్త  కమిటీని ఏర్పాటుచేశారు.  జిల్లా అధ్యక్షునిగా పుట్ట శివ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .ఈ సమావేశంలో, డోన్  ప్యాపిలి  , వెలుగోడు , బండి ఆత్మకూరు. నంద్యాల. మహానంది. ,
పాములపాడు ,గోస్పాడు , రుద్రవరం, ఆర్లగడ్డ. పాణ్యం ,సిరివెళ్ల. మహానంది. కుల పెద్దలు పాల్గొన్నారు. 

 ఈ సందర్భంగా పుట్ట శివ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో
మండలాల కుల పెద్దలు కలసి జిల్లా
అధ్యక్షులు గా నన్ను ఎన్నుకోవడం జరిగిందని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Comments