రామకృష్ణాపూర్‌లో వ్యభిచార గృహం నిర్వహణ: 3 వ్యక్తుల పట్టివేత.

Rathnakar Darshanala
రామకృష్ణాపూర్‌లో వ్యభిచార గృహం నిర్వహణ: 3 వ్యక్తుల పట్టివేత.
నేటి వార్త,రామకృష్ణాపూర్, తేది:20 సెప్టెంబర్ 2024: పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మావతి కాలనీ గద్దె రాగడిలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న మహమ్మద్ మొయిన్, శుక్కుల అవంతి దంపతులను , పత్తి సత్తమ్మ అనే మధ్యవర్తిని శుక్రవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. 

వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరుకు చెందిన మహిళను మోహించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. పోలీసుల దాడిలో 1500 రూపాయల నగదు, 5 మొబైల్ ఫోన్లు,  కండోమ్ ప్యాకెట్ బాక్స్ లు సీజ్ చేశారు. 

రామగుండం పోలీస్ కమిషనర్ , మంచిర్యాల డిసిపి ఆధ్వర్యంలో చట్ట విరుద్ధ కార్యకలాపాలకు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని. అద్దెకు ఇస్తున్న యజమానులు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా మందమర్రి సిఐ చంద్రశేఖర్ సూచించారు.
Comments