కల్లు గీతా కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం అందజేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి.
By
Rathnakar Darshanala
కల్లు గీతా కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం అందజేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి.
నేటివార్త వెల్గటూర్ అక్టోబర్ 25.
ఎండపెల్లి మండలం గుళ్ళకోట గ్రామంలో జగిత్యాల జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గీత కార్మికులకు ప్రభుత్వం నుండి అందిస్తున్న కల్లు గీత కార్మికుల కాటమయ,
రక్షణ కవచం(కిట్లును) శుక్రవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులు మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సుమారు 100 కి పైగా కిట్లను గీత కార్మికులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.
మా గీత కార్మికులకు కటమయ రక్షణ కీట్లను పంపిణీ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని,
ఈ కాటమయ కిట్ల వలన గీత కార్మికులకు చాలా ఉపయోగాలు ఉన్నాయని,ప్రభుత్వం గీత కార్మికుల అభ్యున్నతికి కృషి చేస్తుందని,
ఈత వనాలను పెంచడానికి ప్రభుత్వమే ఈత చెట్లను గీత కార్మికులకు పంపిణీ చేయడం జరుగుతుందని,
అర్హులైన ప్రతి గీత కార్మికుడికి కిట్లను అందేలా చూస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాటిపర్తి శైలెంధర్ రెడ్డి, నాయకులు మల్లేశం, పూదరి రమేష్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Comments