వ్యవసాయ శాఖ చేపట్టబోతున్న హేతుబద్ధీకరణ లో ఏఈఓ లను మినహాయించాలి.

Rathnakar Darshanala
వ్యవసాయ శాఖ చేపట్టబోతున్న హేతుబద్ధీకరణ లో ఏఈఓ లను మినహాయించాలి.


నంద్యాల ప్రతినిధి నేటి వార్త అక్టోబర్ 28 :వ్యవసాయ శాఖ లో క్లస్టర్ స్థాయిలో పని చేస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారులు సీనియర్ అసిస్టెంట్ & సూపరిడెంట్ స్థాయి లో పని చేస్తున్నాము. 

ప్రస్తుతం ప్రభుత్వం మమ్మల్ని రికార్డు అసిస్టెంట్ స్థాయి గల వి ఏ ఏ, వి హెచ్ ఏ, వి ఏ ఎస్, ఎంపీ ఈవో లు  గా గ్రామ స్థాయి లో,

 గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ రైతు సేవా కేంద్రాలలో హేతుబద్ధీకరణ పేరుతో ఏ ఈ ఓ లను నియమించడాన్ని నిరసిస్తూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అని అన్నారు.

ప్రస్తుతం వి ఏ ఏ  లకు ఈ ఓ లుగా పదోన్నతి పొందినందుకు సంఘం తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాము. దీని బట్టి పదోన్నతి పొందిన వి ఏ ఏ పదవి కన్నా ఏ ఈ ఓ పదవి ఉన్నతిని తెలిజేస్తుందని అర్ధం. 

కావున ఏ ఈ ఓ లను తిరిగి కింద స్థాయి గల వి ఏ ఏ లుగా హేతుబద్ధీకరణ చేయడం డిమోషన్ గా పరిగణించవలసి వస్తుంది.

 ఇది పూర్తిగా ఏ ఈ ఓ లకు తీవ్ర అన్యాయము జరుగుతునట్లు భావిస్తూ, ఏఈఓ లను క్లస్టర్ స్థాయి లోనే కొనసాగించాలని, 

మాకు తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.పై విషయాలను వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘ సమావేశము జరుపుకొని చర్చించిన అంశాలను జిల్లా వ్యవసాయ అధికారిని  

పి. యల్. వరలక్ష్మీ ని మర్యాద పూర్వకంగా కలిసి విన్నవించడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా ఆద్యకులు శ్రీ యస్. దాంద్ బాష, ప్రధాన కార్యదర్శి  యస్. ఈ, మనోహర్ కోశ అధికారి  జె. జయరాం మరియు ఉమ్మడి కర్నూల్ జిల్లా సభ్యులు పాల్గొన్నారు.
Comments