నిరుపేద యువకునికి ఆర్థిక సహాయం.
By
Rathnakar Darshanala
నిరుపేద యువకునికి ఆర్థిక సహాయం.
నేటివార్త రాయికల్ అక్టోబర్ 27:
రాయికల్ మండలం
అల్లీపూర్ గ్రామానికి చెందిన ముస్లిం యువకుడు ఇబ్రహీం ప్రమాదవశాత్తు బైక్ పై నుండి పడి,తీవ్ర గాయాలై, జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓం సాయి హాస్పిటల్ లో చేరగా,
వారి ఆర్థిక పరిస్థితి చూసి,చలించి కులమత భేదాలు లేకుండా యువతకు మార్గదర్శకులుగా నిలిచి పిలువగానే అందరికీ అందుబాటులో వుండే యువ నాయకుడు సూతరి తిరుపతి రెడ్డి తన వంతు ఆర్థిక సహాయాన్ని ఐదువేల రూపాయలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఇలాంటి సేవకార్యక్రమాలలో ముందుండే తిరుపతి రెడ్డి ని మిత్రులు లోకిని రాజేందర్,వేల్పుల ప్రవీణ్,జాన గోపి,నర్మెట అనిల్ మరియు గ్రామ ప్రజలు అభినందించారు.
Comments