ఎమ్మెల్యేను, చైర్మన్ ను శాలువాలతో సన్మానించిన మీసేవ ఫెడరేషన్.

Rathnakar Darshanala
ఎమ్మెల్యేను, చైర్మన్ ను శాలువాలతో సన్మానించిన మీసేవ ఫెడరేషన్.
రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నగునూరి శ్రీనివాస్.

పెద్దపల్లి అక్టోబర్ 27 నేటి వార్త ప్రతినిధి అడిచెర్ల రమేష్.

పెద్దపల్లి,తెలంగాణ మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ నాయకులు పెద్దపల్లి శాసన సభ్యులు చింతకుంట విజయరమణ రావు ,పెద్దపల్లి గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలిసి,శాలువాతో సన్మానించారు. 

మీసేవ సమస్యలను వివరించి నవంబర్ 4 న హైదరాబాద్ లోని ఆర్. టీ. సి. కళాభవన్ లో జరిగే సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. 

ఈ కార్యక్రమములో తెలంగాణ మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నగునూరి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి రాజ్ కుమార్,పెద్దపల్లి మండల అధ్యక్షులు మిట్టపల్లి శ్రీనివాస్,నాగుల మల్లేశం, బంక భూమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments