పద్మశ్రీ కనకరాజు మరణం పట్ల జాన్సన్ నాయక్ దిగ్భ్రాంతి.
By
Rathnakar Darshanala
పద్మశ్రీ కనకరాజు మరణం పట్ల జాన్సన్ నాయక్ దిగ్భ్రాంతి.
నేటివార్త,ఖానాపూర్,అక్టోబర్26:
పద్మశ్రీ గ్రహీత,ప్రముఖ గుస్సాడీ కళాకారుడు కనకరాజు మృతి పట్ల బిఆర్ఎస్ నాయకులు ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ సంతాపం వ్యక్తం చేశారు.
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆదివాసీల కళ గుస్సాడీ నృత్యానికి దేశ వ్యాప్తంగా ప్రఖ్యాతి తీసుకువచ్చారని అన్నారు.
గుస్సాడీని దేశానికి పరిచయం చేసిన గొప్ప కళాకారుడని, గుస్సాడీ లో విశేష సేవలు అందించారని అన్నారు.దేశ వ్యాప్తంగా ఆదివాసీల కళను అందరికీ పరిచయం చేశారని అన్నారు. ఆయన మృతి తీరని లోటని అన్నారు.
Comments