మతోన్మాద దోపిడీ విదానాలకు ప్రత్యామ్నాయం మార్క్సిజం అంబేద్కర్ ఆలోచన విధానమే.

Rathnakar Darshanala
మతోన్మాద దోపిడీ విదానాలకు ప్రత్యామ్నాయం మార్క్సిజం అంబేద్కర్ ఆలోచన విధానమే.
- వర్గ సామాజిక ఐక్యతకు నికరంగా నిలబడి పోరాడేది ఎం సి పి ఐ (యు)మాత్రమే.
 - ఎం సి పి ఐ (యు) పార్టీ జిల్లాకార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్.

బెల్లంపల్లి, అక్టోబర్ 27, నేటివార్త :
దేశంలో పెట్రేగిపోతున్న మతోన్మాద దోపిడి విధానాలకు ప్రత్యామ్నాయం

మార్క్సిజం అంబేద్కర్ ఆలోచన విధానమే ఏకైక మార్గమని అందుకోసం నికరంగా నిలబడి ముందుకు సాగుతున్న పార్టీ ఎం సి పి ఐ (యు) మాత్రమే అని ఎం సి పి ఐ (యు)పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్ అన్నారు.

ఎం సి పీ ఐ (యు) మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలో పార్టీ జిల్లాసహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్  అధ్యక్షతన ప్రస్తుత రాజకీయాలు, 

మార్క్సిజం, అంబేద్కర్ ఆలోచన విధానం అనే అంశంపై ఎం సి పి ఐ (యు) వ్యవస్థాపకులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ మద్ది కాయల 

ఓంకార్ 16వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన సభలో వారి స్మారక స్థూపం వద్ద వారి చిత్రపటానికి పార్టీ,ప్రజా సంఘాల నాయకులు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా
జిల్లాకార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్,సభ అధ్యక్షులు పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ 77 సంవత్సరాల స్వాతంత్ర భారత దేశంలో ఆకలి, 

దారిద్రం. నిరుద్యోగం. ఆత్మహత్యలు,అత్యాచారాలు, హింసతోపాటు కుల-మత బేధాలు, ప్రాంతీయ తత్వాలను పాలకవర్గాలు అనైతిక రాజకీయ విధానాలతో పెంచి పోషిస్తూ సెక్యులర్ పేరుతో 

కాంగ్రెస్ పార్టీ దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన ఆర్థిక దోపిడితో పాటు కులమత తత్వాలను పెంచి పోషించిందని, ఆర్ఎస్ఎస్ భావజాలంతో మూడోసారి కేంద్రాన్ని పాలిస్తున్న బిజెపి కూడా తన మత భావాజాలన్నీ పెంపొందించుకుంటూ

 మైనార్టీ మతాలపై,దళిత,గిరిజన, అట్టడుగు వర్గాలపై మనువాద పాలన పేరుతో దాడులకు పూనుకుంటూ వస్తుందని,గత పాలకవర్గం లాగానే కార్పొరేట్, 

పెట్టుబడుదారి వర్గాలకు దేశ సంపదను ఆదాని, అంబానీలకు కట్టబెట్టిందని ,తన మతోన్మాద పెట్టుబడుదారి,ఆర్థిక విధానాలను ప్రశ్నించిన వారిపై పాసీజంతో దురాహంకారపూరితమైన  ఉన్మాదా చర్యలకు  పూనుకుంటుందని,

ఎన్నికల కమిషన్, న్యాయవ్యవస్థ, లాంటి స్వతంత్ర వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకొని  దేశ రాజకీయ వ్యవస్థలను కలుషితం చేస్తుందని,

భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నదని,ఒకే దేశం,ఒకే మతం,ఒకే భాష అంటూ ఒకే ఎన్నికల పేరుతో జమిలి ఎన్నికల విధానానికి ఒడిగట్టి ప్రజాస్వామ్య విలువలను,రాజ్యాంగ విలువలను సమాధి చేస్తుందని,

 అనేక ఆంక్షల నేపథ్యంలో సాధించుకున్న మన తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన గత బిఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్  కూడా రాష్ట్ర అభివృద్ధి పేరుతో కేంద్రంలోని బిజెపి చేసిన తప్పుడు చట్టాలను ప్రజా వ్యతిరేక విధాలను బలపరుస్తున్నాయని,

 కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న పాసిస్ట్,మనువాద విధానాలకు, సెక్యులర్ ముసుగులో ఉన్న కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా కార్పొరేట్, 

పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలను కొనసాగిస్తున్న దోపిడి వర్గాల పాలనలో సమస్త హక్కులు కోల్పోతున్న శ్రామిక వర్గ ఐక్య పోరాటాల బలోపేతానికి మార్క్సిజమే మార్గదిశగా, 

తరతరాలుగా అసమానలతో అణిగిమనిగి ఉన్న భారత సమాజాన్ని అంబేద్కర్ ఆలోచన విధానంతో నిర్మూలించే దిశగా రాజకీయ ఆర్థిక సామాజిసమానత్వాన్ని బహుజనులకు రాజ్యాధికారాన్ని సాదించేందుకు  ఎంసిపిఐ (యు) పార్టీ ముందుండి పోరాడుతుందని అన్నారు.

 ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి ఆరెపల్లి రమేష్,మండల కార్యదర్శి సతీష్,మహిళ సమాఖ్య నాయకులు కాంపల్లి రాధ,దుర్గం లక్ష్మి, కామెర పద్మ, యువజన విద్యార్థి నాయకులు నరేష్, శేఖర్, సాయి, రాం మహేష్, ఆకాష్, అరుణ్ వివిధ మండలాల నాయకులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Comments